Homeవినోదంవిమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం

విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, తన ఇద్దరు కూతుళ్లు దుర్మరణం


Christian Oliver Plane Crash: అమెరికన్ నటుడు క్రిస్టియన్ ఒలివర్.. ఒక ప్లెయిన్ క్రాష్‌లో మరణించాడు. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా అదే ప్లెయిన్‌లో ఉన్నారు. సెయింట్ విన్సెంట్ పోలీసులు చెప్పినదాని ప్రకారం.. తూర్పు కారేబియన్ దగ్గర ఉన్న ఒక చిన్న ప్రైవేట్ ఐల్యాండ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఐల్యాండ్ నుండి సెయింట్ లూసియా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు చెప్తున్నారు.

పైలెట్ కూడా మృతి..
తూర్పు కారేబియన్‌లోని బేకుయా దగ్గర పెటిట్ నెవిస్ అనే ఒక ఐల్యాండ్ ఉంది. క్రిస్టియర్ ఒలివర్.. ఆ ఐల్యాండ్ నుండి సెయింట్ లూసియా వెళ్లడానికి ప్రయాణమయ్యాడు. అదే సమయంలో తను ఉన్న ప్లెయిన్ క్రాష్ అయ్యి.. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు కూడా మరణించారు. క్రిస్టియన్ ఒలివర్ పెద్ద కూతురు యానిక్ క్లెప్సర్‌కు 12 ఏళ్లు కాగా.. చిన్న కూతరు మడీటా క్లెప్సర్‌కు పదేళ్లు. ఈ ముగ్గురుతో పాటు విమానాన్ని నడుపుతున్న పైలెట్ రోబర్ట్ సాక్స్ కూడా ఈ ప్లెయిన్ క్రాష్‌లో మరణించినట్టు తెలుస్తోంది. అసలు ప్లెయిన్ క్రాష్ ఎందుకు జరిగింది అనే వివరాలు ఇంకా తెలియలేదని పోలిసులు చెప్తున్నారు.

మత్స్యకారులే ముందుగా చూశారు..
ముందుగా ఈ ప్లెయిన్ క్రాష్‌ను ఆ ఐల్యాండ్‌లో పనిచేసే మత్స్యకారులు చూశారు. చూసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ కోస్ట్ గార్డ్.. ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. ఏ భయం, స్వార్థం లేకుండా ప్లెయిన్ క్రాష్ అవ్వడం చూసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో చిక్కకున్న వారిని కాపాడే ప్రయత్నం చేసిన మత్స్యకారులను, డైవర్లను పోలీసులు ప్రశంసించారు. క్రిస్టియన్ ఒలివర్ మరణ వార్త విని ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అసలు ఒలివర్ ఆ ఐల్యాండ్‌కు ఎందుకు వెళ్లాడు, ప్లెయిన్ క్రాష్‌కు కారణమేంటి వంటి విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జర్మనీ వదిలేసి అమెరికాకు..
51 ఏళ్ల ఈ నటుడు.. 1994లో నటుడిగా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ముందుగా టీవీ సిరీస్‌లతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ‘సేవ్డ్ బై ది బెల్ – ది న్యూ క్లాస్’ అనే టీవీ సిట్‌కామ్ సిరీస్ నటుడిగా క్రిస్టియన్ ఒలివర్‌కు మంచి పేరు తీసుకురావడంతో పాటు మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ‘ది బేబి సిట్టర్స్ క్లబ్’ అనే సినిమాతో క్రిస్టియన్ ఒలివర్.. వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు, టీవీ సిరీస్‌లతో బిజీ అయ్యాడు. ఇక క్రిస్టియన్ ఒలివర్ చివరిగా ‘హంటర్స్’ అనే టీవీ సిరీస్‌లో నటుడిగా కనిపించాడు. గతేడాది విడుదలయిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి తన వాయిస్‌ను అందించాడు. వెస్ట్ జర్మనీలో పుట్టి పెరిగిన క్రిస్టియన్ ఒలివర్ నటుడు అవ్వాలనే కలతో అమెరికాలో అడుగుపెట్టాడు. ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. లాస్ ఏంజెల్స్, న్యూయార్క్‌లాంటి సిటీల్లో నటుడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. జర్మనీకి చెందినవాడు కావడంతో ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తను జర్మన్ టీవీ సిరీస్‌లలో కూడా నటించాడు.

Also Read: దేవర ఆడియో @ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments