Homeవినోదంవిజయ్‌ దేవరకొండకు ట్రాన్స్‌జెండర్‌ థ్యాంక్స్‌ - మీరే దేవుడు అంటూ ఎమోషనల్‌, వీడియో వైరల్

విజయ్‌ దేవరకొండకు ట్రాన్స్‌జెండర్‌ థ్యాంక్స్‌ – మీరే దేవుడు అంటూ ఎమోషనల్‌, వీడియో వైరల్


Transgender Thanks to Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విజయ్‌ మ్యానరిజం, మాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనవరం లేదు. లవ్‌ రొమాంటిక్ సినిమాలతో యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌కి బయటకు కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ రౌడీ హీరో ఉదారత గురించి తెలిసిందే. లాక్‌డౌన్‌లో తన ఫౌండేషన్‌ ద్వారా ఎంతో పేదవాళ్లకు సాయం అందించాడు. ఇక ఖుషి మూవీ టైంలో 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పు కోటీ రూపాయలు పంచాడు.

అలాగే ఫ్యాన్స్‌ని ఫ్రీ విమానంలో కునుమనాలి పంపించాడు. ఇలా తరచూ తన ఫ్యాన్స్‌, ప్రజలకు కోసం తనకు చేతనైనా సాయం చేస్తుంటాడు ఈ రౌడీ హీరో. ఈ క్రమంలో మరోసారి విజయ్‌ గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్‌జెండర్‌ అతడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల విజయ్‌ ఆహా ప్రసారం అవుతున్న ఇండియన్‌ ఐడల్‌ షోకి ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షో విజయ్‌ కంటెస్టెంట్స్‌కి మద్దతు ఇస్తూ.. జడ్జస్‌పై తనదైన పంచులు వేస్తూ సందడి చేశాడు. ఈ నేపథ్యలో ఇదే షోకు విజయ్‌ ఫౌండేషన్‌ నుంచి ఆర్థిక సాయం అందుకున్న ఓ ట్రాన్స్‌జెండర్‌తో పాటు ఓ ఫ్యాన్‌ పాల్గొని విజయ్‌ గొప్ప మనసు గురించి మరోసారి గుర్తు చేశారు. 

ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. “నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సర్‌. మీకు థ్యాంక్స్‌ చెప్పాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. మాకు జీవినధారం భిక్షాటనే సర్‌. లాక్‌డౌన్‌ కారణంగా అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో మా జీవనం చాలా కష్టమైంది. నేను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అదే టైంలో గూగుల్‌ విజయ్‌ ఫౌండేషన్‌ అని కనిపించింది. అది క్లిక్‌ చేసి నాకు సాయం కావాలని ఫాం ఫిల్‌ చేశాను. అది చేసిన 16 నిమిషాల్లోనే మీ ఫౌండేషన్‌ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్క నాకే కాదు నాలాంటి 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌కి మీరు సాయం చేశారు. వాళ్లకే నా కుటుంబానికి కూడా ఎంతో సాయం చేశారు. అప్పుడు నాకు నిజంగా అనిపింది.. కనిపించని దేవుడు ఎక్కడో లేడు. మీలోనే ఉన్నారు అనిపించింది” అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్‌ కూడా మీలాంటి ఎంతోమంది సాయం చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. “ఇది తన ఒక్కడి వల్లే సాధ్యం కాలేదని.. దాదాపు 2 కోట్ల మధ్య ఎక్కడి నుంచో రూ. 500, రూ. 1000 సాయం చేశారు. వారందరి వల్ల ఇది సాధ్యమైంది. నిజం ఇంత మంచి మనుషులు మన మధ్య మనం ఉండటం ఆశీర్వాదం” అంటూ విజయ్‌ చెప్పుకొచ్చాడు. అలాగే ఓ ఫ్యాన్స్‌ కూడా విజయ్‌ వల్ల తాను మొదటి సారి ఫ్లయిట్‌ ఎక్కాను అని చెప్పాడు. తన ఊర్లో ఇంతవరకు ఎవరూ విమానం ఎక్కలేదని, మొదటి మీ వల్లే ప్లయిట్‌ ఎక్కి.. ఫ్రీగా కనుమనాలి చూసోచ్చానని చెప్పాడు. మీ మీరో ఏం చేశాడురా.. అంటే నేను గర్వంగా మా విజయ్‌ అన్న లాక్‌డౌన్‌లో ఎంతోమంది ప్రజలకు సాయం చేశాడని, 100 కుటుంబాలకు ఆర్థిక సాయం చేశాడు. ఫ్రీ విమానం ఎక్కించాడని గర్వంగా చెబుతానంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

Also Read: ‘కల్కి 2898 AD’ మూవీపై మహేష్‌ బాబు లేట్‌ రివ్యూ – ప్రతి ఫ్రేం కళాఖండం, నాగ్‌ అశ్విన్‌ రిప్లై చూశారా?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments