Ram Charan’s Orange Movie Re Release: ‘ఆర్ఆర్ఆర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో నటుడిగా మరోసారి మెప్పించారు. అందులో అప్పన్న పాత్రకు మంచి అప్లాజ్ లభించింది. ప్రస్తుతం చరణ్ RC16తో షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దాని కంటే ముందు మరోసారి థియేటర్లలో ఆయన సందడి చేయనున్నారు.
ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘ఆరెంజ్’ రీ రిలీజ్
రామ్ చరణ్ రొమాంటిక్ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అదే రామ్ చరణ్ ‘ఆరెంజ్’ మూవీ. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూవీ ప్లాప్‌గా నిలిచింది. కానీ ‘ఆరెంజ్’ మూవీ అప్పటి యూత్, మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. కారణంగా అసలు ప్రేమ ఎంతకాలం ఉంటుందనే నిజాన్ని ‘ఆరెంజ్’తో తెలియజేశాడు డైరెక్టర్. ‘బొమ్మరిల్లు’ మూవీ డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్, జెనిలియా హీరో హీరోయిన్లుగా ‘ఆరెంజ్’ మూవీ తెరకెక్కింది. 2010 నవంబర్ 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం లభించలేదు. అయితే ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఇందులో లవర్‌గా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జీవితాంతం అదే ప్రేమ ఇవ్వలేనని, టెంపరరీగా మాత్రమే లవర్ ఉండగలను అంటూ గర్ల్ ఫ్రెండ్స్‌ని మారుస్తుంటాడు చరణ్. ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేమని, మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు.. కాబట్టి ప్రేమించుకున్నన్ని రోజులు ప్రేమించుకుందాం అనే సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించాడు భాస్కర్.
ఈ వాలంటైన్స్ డేకి థియేటర్లో సందడి
ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉండదు అనే నిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. టెంపరరీ ప్రేమ మాత్రమే ఇవ్వగలనంటూ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. టెంపరరీ గర్ల్ ఫ్రెండ్‌గా ఉండేందుకు ఒప్పుకోలేక, ప్రియుడిని వదులుకోలేని ప్రియురాలిగా జెనిలియా తన నటనతో ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్లాప్‌గా నిలిచిన ఈ చిత్రం లవర్స్‌కి, యాత్కి మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా పాటలతో సంగీత ప్రియులను అలరించిన ఆరెంజ్ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. 2023లో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసారి ఏకంగా ప్రేమికుల రోజు దినోత్సవంగా సందర్భంగా అదే ఆరెంజ్ మళ్లీ థియేటర్లోకి వస్తుండటంతో ఈ వాలంటైన్స్ డే లవర్స్‌కి మరింత ప్రత్యేకంగా నిలవనుంది. దీంతో మూవీ లవర్స్, మెగా అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులకు, యూత్‌కి పర్ఫెక్ట్ సినిమాని అందిస్తున్నారంటూ మూవీ టీంకి థ్యాంక్స్ చెబుతున్నారు. కాగా ఈ సినిమా మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
మరిన్ని చూడండి