Suriya Kanguva Trailer Release తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ (Kanguva Movie). పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా దర్శకుడు శివ రూపొందిస్తున్న ఈ సినిమాను దర్శకుడ శివ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశ పటాన్ని, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా (Kanguva Trailer) దసరా కానుక అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
Kanguva Trailer Update: ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చింది కంగువ టీం. ఈ మేరకు గ్రీన్ స్టూడియోస్ సంస్థ ట్వీట్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 12న కంగవ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచారం పోస్టర్స్, టీజర్, ఫైర్ సాంగ్ మూవీపై అంచనాలు పెంచాయి. దీంతో ట్రైలర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను అలరించే సూర్య ఈ సినిమాతో ఓ కొత్త జానర్‌ని టచ్ చేశాడు.
పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటి వరకు తెరపైకి రాని సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. దాదాపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో తెరకెక్కుతోంది. త్రీడీలోనూ కంగువను ప్రేక్షకులకు అందుకుబాటులోకి తీసుకువస్తుంది మూవీ టీం. ఇక తమిళ్‌తో పాటు, తెలుగు, హిందీ, మలయాళం,కన్నడ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘కంగువ’ మూవీ నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? – ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..!
రెండు భాగాలుగా కంగువ
కాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందకు తీసుకువస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. గతంలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కంగువాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నామని, మొదట్లోనే ‘కంగువ’ సినిమాకు సంబంధించి రెండు భాగాలుగా కథ రాసుకున్నామన్నారు. సెకండ్ పార్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందన్నారు. పార్ట్ 1 రీలీజ్ కాగానే వీలైనంత త్వరగా సీక్వెల్ నిర్మాణ పనులు చేపట్టి 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.
Also Read: ఓటీటీకి వచ్చేసిన ‘ఇండియన్ 2’ – ఆ సీన్లపై దారుణమైన ట్రోల్స్, మీమ్స్‌తో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు
మరిన్ని చూడండి