Karan Johar: టాలీవుడ్ అంటే మాస్, బాలీవుడ్ అంటే క్లాస్. ప్రేక్షకుల మదిలో నాటుకుపోయిన విషయం ఇది. బాలీవుడ్ హీరోలు మాస్ లుక్స్‌లో కనిపించడం అరుదు. అదే మన హీరోలకు అయితే కొదవేలేదు. అయితే, ఈ మధ్య పాన్ ఇండియా పుణ్యమా అని మన హీరోల మాస్ లుక్స్, మాస్ స్టైల్స్ బాలీవుడ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్‌జోహార్ తన కొత్త యాడ్‌లో టాలీవుడ్ హీరోల మాస్ లుక్స్‌లో కనిపించారు. ఆయనతో పాటుగా కియారా అద్వానీ కూడా యాడ్‌లో కనిపించి సందడి చేసింది. ఇక ఆ యాడ్‌లో రజనీకాంత్ స్టైల్‌ని ఫాలో అయ్యారు కరణ్. మాస్ లుక్‌లో మెడలో కండువా, చైన్, నోట్లో పుల్లతో పక్కా మాస్ మ్యాన్‌గా మారిపోయాడు.
కళ్లద్దాల యాడ్‌లో కరణ్, కియరా
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్‌జోహార్, కియారా అద్వానీతో కలిసి నటించిన ఒక కళ్లద్దాల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంట్లో కరణ్.. మాస్ లుక్స్‌లో కనిపించారు. మహేశ్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ధనుష్ లాంటి స్టార్ హీరోలు మాస్ లుక్స్‌లో పెట్టుకున్న అద్దాలను పెట్టుకున్న కరణ్.. ఒక్కసారిగా ఆ హీరోల్లా మారిపోయి.. మాస్ స్టైల్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు.
కళ్లజోళ్ల షాప్‌లోకి వెళ్లిన కరణ్‌కి కియారా ఒక స్టైలిష్ అద్దాలు ఇస్తుంది. “సౌత్ ఇండియన్ స్టార్ లుక్? పాన్ ఇండియా” అంటూ ఆ కళ్లద్దాలు పెట్టుకున్న వెంటనే క్లాస్ లుక్‌లో ఉన్న కరణ్ ఒక్కసారిగా రౌడీ లుక్‌లోకి మారిపోతాడు. నోట్లో టూత్ పిక్, మెడలో కండువ, రంగుల చొక్కాతో కనిపిస్తాడు. “నువ్వు కొంటున్నావా?” అంటే.. “నేనే కాదు.. అందరూ కొంటున్నారు” అంటూ మాస్ డైలాగ్‌లు చెప్తూ రజకీకాంత్ స్టైల్‌లో తన కార్డ్ విసిరి పేమెంట్ చేస్తున్నట్లు ఉంది ఆ యాడ్‌లో. దానికి సంబంధించి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు ఆయన.
తమన్నా రియాక్షన్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆ వీడియోపై తమన్నా కూడా రియాక్ట్ అయ్యారు. “సో క్యూట్” అంటూ కామెంట్ చేశారు తమన్నా. పోయిన ఏడాది రిలీజైన రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో తమన్నా.. నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన స్టైల్‌లో కరణ్ యాడ్ చేయడంతో ఆమెకు తెగ నచ్చేసిందట. ఆమే కాదు.. ఎంతోమంది రజనీఫ్యాన్స్ కూడా ఆ వీడియో కింద తెగ కామెంట్లు పెడుతున్నారు. సూపర్ స్టైల్ అంటూ తమదైన శైలిలో రీపోస్ట్ చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు టాలీవుడ్ అంటే చాలా చిన్నచూపు చూసేవాళ్లు. చాలా సందర్భాల్లో మనల్ని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా. కానీ, ఇప్పుడు మన వాళ్లు తీస్తున్న సినిమాలు, పాన్ ఇండియా లెవెల్‌లో మనవాళ్లు చేస్తున్న అద్భుతాలు చూస్తున్న వాళ్లు కూడా మనల్ని ఫాలో అయిపోతున్నారు. అలా ఇప్పుడు కరణ్ మన హీరోల మాస్‌లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు అంటున్నారు నెటిజన్స్.
Read Also: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘గుంటూరు కారం‘, ఏంటీ షాకయ్యారా? ఇవిగో ప్రూఫ్స్