Homeవినోదం‘యానిమల్‌’లోనూ అదే ఫార్ములా - అరే బాబు, ఆ గన్‌ను విడిచిపెట్టరా?

‘యానిమల్‌’లోనూ అదే ఫార్ములా – అరే బాబు, ఆ గన్‌ను విడిచిపెట్టరా?


Animal Trailer Review: ఒక ఫార్ములాతో ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే.. ఇక తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే ఫార్ములాను ఉపయోగిస్తుంటాయి. కొన్నాళ్లకు ఈ ఫార్ములా చూసి ఆడియన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుంది. అయితే యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా అలాంటి ఒక ఔట్‌డేటెడ్ సక్సెస్ ఫార్ములాను తన ‘యానిమల్’ మూవీలో ఉపయోగించడం.. తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సందీప్. ఇక తాజాగా విడుదలయిన ‘యానిమల్’ ట్రైలర్ చూస్తుంటే.. ఈ ఔట్‌పుట్ కోసం నాలుగేళ్లు ఆగడంలో తప్పు లేదని కొందరు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కానీ మొత్తం ట్రైలర్‌లో ఒక షాట్ మాత్రం చాలామందిని డిసప్పాయింట్ చేసింది.

యాక్షన్‌తో నిండిపోయిన ‘యానిమల్’ ట్రైలర్..
తన తరువాతి సినిమాతో వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటికే ఛాలెంజ్ చేశాడు. అనుకున్నట్టుగానే ‘యానిమల్’లో వైలెన్స్‌కు కొత్త అర్థం చెప్పేలా ఉన్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పైగా సందీప్ రాసుకున్న వైలెంట్ పాత్రకు రణబీర్ కపూర్ ప్రాణం పోశాడు. హ్యాండ్‌సమ్ హీరో రణబీర్.. ఇప్పటివరకు ఇంత నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో ఎప్పుడూ కనిపించలేదు. ట్రైలర్ మొదలయిన దగ్గర నుండే తన పాత్ర ఎలా ఉంటుందో స్పష్టంగా చూపించాడు సందీప్. ట్రైలరే ఇలా ఉందంటే.. ఇక మూడు గంటలు థియేటర్‌లో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ట్రైలర్ మొత్తం కొత్తగా, డిఫరెంట్‌గా అనిపించినా.. కేవలం ఒక్క షాట్‌ మాత్రం రొటీన్‌గా అనిపించింది అనుకుంటున్నారు ప్రేక్షకులు.

మెషీన్ గన్ ఫార్ములా..
‘ఖైదీ’ దగ్గర నుంచి ‘విక్రమ్’ వరకు, ‘కేజీఎఫ్’ దగ్గర నుంచి ‘వాల్తేరు వీరయ్య’ వరకు దర్శకులంతా ఒక రొటీన్ సక్సెస్ ఫార్ములాను ఉపయోగించారు. అదే మామూత్ మెషీన్ గన్. ముందుగా ‘ఖైదీ’ చిత్రంలో కార్తీ.. దీనిని ఉపయోగించినప్పుడు స్క్రీన్‌పై దానిని చూసిన ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్.. మళ్లీ ఈ గన్‌ను ‘విక్రమ్’లో చూసినప్పుడు కామన్‌గా ఫీలయ్యారు. మెల్లగా ప్రతీ దర్శకుడు ఏదో ఒక యాక్షన్ సీన్‌లో ఈ గన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టాడు. ‘యానిమల్’ ట్రైలర్ మొత్తంలో యాక్షన్‌ను డిఫరెంట్‌గా చూపించిన దర్శకుడు.. ఒక్క షాట్‌లో మాత్రం ఈ మెషీన్ గన్‌ను ఉపయోగించినట్టు చూపించాడు. దీంతో మళ్లీ ఈ గన్‌ను తెరపై చూడాలా అన్నట్టుగా ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతున్నారు.

డిసెంబర్ 1న రిలీజ్..
రణబీర్ కపూర్, రష్మిక మందనా జంటగా నటించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఈ చిత్రం విడుదల కానుంది. డ్యూరేషన్ విషయంలో ప్రేక్షకులు కాస్త అనుమానంతో ఉన్నా.. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు ఆ మాత్రం నిడివి ఉండాలేమో అని పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. రణబీర్ సైతం ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రణబీర్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: ఇంటర్నేషనల్ ఓటీటీకి ‘ఆదికేశవ’ – వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమా డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments