గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్ళింది. దర్శకుడుగా పరిచయం అయిన ‘ఉప్పెన’ సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరిన బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ నేడు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అది ఏమిటంటే…
చాముండేశ్వరి మాత ఆశీస్సులతో…
రామ్ చరణ్ 16వ చిత్రమిది (RC16 Movie). దీనికి ‘పెద్ది’ టైటిల్ ఖరారు చేశారు. ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. హీరో 16వ సినిమా కనుక RC16 అని వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఉదయం మైసూరులోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయానికి బుచ్చి బాబు వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ మైసూరులో లేరు.
మండే నుంచి మైసూరులో రామ్ చరణ్…ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్ సిటీలోనే ఉన్నారని తెలిసింది. ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఆయన మైసూరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మండే నుంచి రామ్ చరణ్ మీద సన్నివేశాలు తెరకెక్కించడానికి బుచ్చి బాబు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఇతర ప్రధాన తారాగణం మీద కీలకమైన సన్నివేశాలు తీయడానికి రెడీ అయ్యారు.
It’s a BIG DAY….
The most awaited moment 🤗🤗🤗
Started with the blessings of Chamundeshwari Matha, Mysore 🙏🏼🙏🏼🙏🏼Blessings needed 🤍🤗🙏🏼#RC16 pic.twitter.com/fPnEgZRxeT
— BuchiBabuSana (@BuchiBabuSana) November 22, 2024
ఉత్తరాంధ్ర నేపథ్యంలోని కథతో సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను ఉత్తరాంధ్రకు తీసుకు వెళ్లి చిత్రీకరణ చేయడం కష్టం. దానికి తోడు కథ అనుగుణంగా కొన్ని సన్నివేశాలు వేరు వేరు ప్రదేశాలలో చిత్రీకరించాల్సి ఉంది. సో… ఇప్పుడు ఆ సీన్లు తీస్తున్నారు.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్!
RC16 movie actress: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. దీనికి ముందు ఎన్టీఆర్ ‘దేవర’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రామ్ చరణ్ చిత్రానికి రత్న వేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? – అన్నీ క్రేజీ సినిమాలే
‘గేమ్ చేంజర్’ కోసం మధ్యలో కొంత గ్యాప్
సంక్రాంతికి రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ చేంజర్’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 10న ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం మధ్యలో బుచ్చిబాబు సినిమా చిత్రీకరణకు చరణ్ కొంత గ్యాప్ ఇవ్వనన్నారు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
మరిన్ని చూడండి