Chiranjeevi’s Mega 156 Launch : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 156వ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. బ్లాక్ బస్టర్ ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ రోజు సినిమా లాంఛనంగా మొదలైంది. ఫాంటసీ జానర్ సినిమా అని ఇంతకు చెప్పిన సంగతి తెలిసిందే.
పూజా కార్యక్రమంలో దర్శకుడు వశిష్ఠకు చిరంజీవి, సురేఖ దంపతులు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా… దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్, మారుతి సహా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.
మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ
సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది తెలుగు చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే… ఆ పద్ధతికి కొన్ని రోజులుగా బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 చిత్ర బృందం తీసుకు వచ్చింది. ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ సమక్షంలో చిరు హాజరు కాగా… మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు.
సినిమాలో మొత్తం ఆరు పాటలు
సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్ళీ ఈ సినిమాతో తీసుకు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు. దర్శకుడు వశిష్ఠతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అద్భుతమైన సినిమాలో తాను కూడా ఒక భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబోస్ చెప్పారు.
Also Read : అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ – పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి – గంటా శ్రీధర్ – నిమ్మగడ్డ శ్రీకాంత్ – మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.
Also Read : ‘దిల్’ రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ – అయితే అతి త్వరలో!
Chiranjeevi New Movie Update : నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆరు నెలలు చిత్రీకరణ జరుగుతుందట. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు… ఆరు నెలలు షూటింగ్ చేసి. ఆ తర్వాత ఆరు నెలలు సీజీ వర్క్ కోసం కేటాయించాలని ముందుగా డిసైడ్ అయ్యారట. ఇందులో ముగ్గురు కథానాయికలుగా అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial