Krishna Mukunda Murari Serial November 17th Episode: మురారి కృష్ణ దగ్గరకు వచ్చి మళ్లీ చీర ఇస్తాడు. ఆ రింగ్ తనే ఇచ్చానని ఇంట్లో వాళ్లకి చెప్పేసుంటే ఇంత ప్రాబ్లమ్ వచ్చేది కాదు కదా అని కృష్ణతో అంటాడు. మిమల్ని వారందరూ తిడతారని నేను అలా చెప్పలేదని కృష్ణ అంటుంది.
మురారి: (మనసులో.. ఎస్ అదే అడుగుతాను నా మీద మాట పడటం ఇష్టం లేదు అంటే గతంలో ఈ వేణి చదువుకు నేను కారణం అనా లేక ఇంకేమైనా ఉందా.. ) నేను మిమల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిజం చెప్తారా. గతంలో మీరు నాకు ఫ్రెండా. పెద్దమ్మ చెప్పినట్లు నేను మీకు చదివించడం వరకేనా అంతకు మించి ఏం లేదా. అంటే నేను ఎవర్ని.. ఏం చేసేవాడిని?
కృష్ణ: (మనసులో మీరు నా దైవం, నా సర్వశ్వం మీరే నాకు అన్నీ అని అరచి చెప్పాలి అని ఉన్నా చెప్పలేని పరిస్థితి నాది ఏసీపీ సార్. భర్త భార్యని ఎవరూ అని అడిగితే మీరే నా భర్త అని చెప్పలేని పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదు.) ఏం లేదు సార్ మీరు నాకు కేవలం నా చదువుకి డబ్బులు ఇచ్చిన విద్యాధాత మాత్రమే.
మురారి: మీరు అబద్ధం చెప్తున్నారు అని మీ కళ్లే చెప్తున్నాయి. ఓకే సాయంత్రం ఈ చీర కట్టుకొని రండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎవ్వరికీ భయపడొద్దు. జరిగినవి మర్చిపోయి నా కోసం ఈ చీర కట్టుకోండి.
మధు: కృష్ణతో రీల్స్ చేసిన అన్ని రోజులు చాలా బాగుండేది. ఇప్పుడు ఆ రీల్స్‌కి డబ్బులు కూడా వస్తున్నాయి. సారీ కృష్ణ నేను నీకు ఏం చేయలేకపోతున్నాను
రేవతి: మధు మధు మీ పెద్ద పెద్దమ్మ ఇందాక అమెరికాకి కాల్ చేసి రెండు రోజుల్లో ముకుంద, మురారిలను అమెరికా పంపిస్తానని చెప్పింది. ముకుంద కూడా అక్కకి ఏవేవో చెప్పి అక్క మనసు మార్చేస్తుంది. ఓరేయ్ మాట్లాడవేంటిరా
మధు: ఏం మాట్లాడాలి పెద్దమ్మ.. కృష్ణ చేసిన తప్పు ఏంటి చీపో అని ఓ పాడు పడిన కొంపలో ఉంచిన ఒక్క మాట కూడా అనకుండా భరిస్తుంది. ఉంగరం కోసం రచ్చ రచ్చ చేస్తే ఏం అనకుండా దొంగ అనే ముద్ర వేయించుకుంది. వాళ్ల చిన్నాన్న ఏమో కృష్ణ కోసం హంతకుడు అనే ముద్ర వేయించుకొని జైలులో ఉన్నాడు. ఇక్కడ కృష్ణకి మురారి ప్రేమగా కానుక ఇస్తే అది ఓర్వలేక ఆ ముకుంద దారుణంగా అబద్ధం చెప్పింది. అప్పుడు మురారి నాకు ఇచ్చాడు అంటే ఎక్కడ మురారి మాటలు పడాల్సివస్తుందోనని ఆ నింద తన మీద వేసుకొని దొంగగా బయటకు వెళ్లింది. ఏంటి పెద్దమ్మ ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకున్నావా ఇందాక ముకుంద పెద్ద పెద్దమ్మతో చెప్తుంటే విన్నాను. ఇంత జరుగుతున్నా సహిస్తున్నా ఆ పిచ్చిదాన్ని ఇంకా ఏం చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు పెద్దమ్మ కన్నీళ్లు ఆ కన్నీళ్లుకు అర్ధం ఉందా. ఆ బాధ అనవసరం పెద్దమ్మ. నీ కొడుకు కోడలు భవిష్యత్‌ని వేరే వాళ్ల దగ్గర పెట్టడం ఏంటి. పెద్ద పెద్దమ్మ దగ్గరకు వెళ్లి ఫోన్‌లో ఏం మాట్లాడావో అని అడగలేవా.
రేవతి: అడుగుతాను రా తప్పకుండా అడుగుతాను పండగ అయిపోని. నిజంగానే అడుగుతాను
మురారి ఫ్యామిలీ మొత్తం ఆరు బయట టపాసులు కాల్చడానికి వస్తారు. వేణి ఇంకా రాలేదేంటని మురారి ఎదురు చూస్తుంటాడు. గతం మర్చిపోయిన కృష్ణ కోసమే ఆలోచించడం ఏంటని ముకుంద అనుకుంటుంది. ఇంతలో కృష్ణ, వాళ్ల పిన్ని వస్తారు. కృష్ణ మురారి ఇచ్చిన చీరలో వస్తుంది. ఇక అందరూ సంతోషంగా టపాసులు కాల్చుతారు.
ముకుంద: ఏం కృష్ణ చీర పంపించానని తెగ సంబర పడ్డావు కదా. ఏంటి షాపింగ్‌లో ఏదో అన్నావు నువ్వు కట్టిన తర్వాత నేను ఈ చీర కట్టాలా ఇప్పుడు నేను కట్టిన తర్వాత నువ్వు కట్టావు. ఇప్పటికైనా అర్ధమైందా నువ్వు నేను ఒకటి కాదని. నాతో నువ్వు పోటీ పడలేవు అని.
కృష్ణ: ముకుంద ఇప్పుడు నువ్వు నాకు ఏం అన్నావో నేను నీకు అదే అన్నాను అనుకో వెళ్లి పని చూసుకో
టాపాసులు కాల్చుతుండగా కృష్ణ చీరకు నిప్పు అంటుకుంటుంది. దీంతో మురారి కృష్ణ అంటూ వెళ్లి ఆర్పేందుకు ప్రయత్నిస్తాడు. అందరూ జాగ్రత్తలు చెప్తారు. ఇంతలో మధు వాటర్ తీసుకొచ్చి మంట ఆర్పుతాడు. కృష్ణ కళ్లు తిరిగి పడిపోతుంది. మురారి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. భవాని తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటుంది.
భవాని: మనసులో ఒకవేళ మురారికి గతం గుర్తొస్తే ఆ క్రిమినల్స్‌తోనే ఉండాలా. అప్పుడు మురారికీ ఎం చెప్పినా వినడు. ఇప్పుడే ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. అప్పుడు ఏం వింటాడు
నందిని: మురారికీ గతం గుర్తొచ్చినట్లు ఉంది అమ్మా. లేదంటే వేణి అని పిలిచే మురారి కృష్ణ అన్నాడు అంటే అని చెప్తుంటే మాట్లాడకు నందిని అని భవాని గట్టిగా అరుస్తుంది. ఆ మాట వింటుంటే చిరాకుగా ఉంది
ముకుంద: అత్తయ్య మీరు కోప్పడినా సరే నందిని చెప్పిందే నిజం అనిపిస్తోంది.
భవాని: ఆపుతారా మీరు కాసేపు. సోది చెప్పకండి అలా మాట్లాడాలి అనుకుంటే మీరు పక్కకెళ్లి మాట్లాడుకోండి. ఇక్కడ డిబెట్స్ పెట్టకండి నాకు కంపరంగా ఉంది. అసలు కొంచెం అయినా లాజిక్‌గా ఆలోచించరా. నందూ అంటే జరిగింది చూడలేదు. వాళ్లు అంటే అభిమానంతో మాట్లాడుతుంది అనుకోవచ్చు. కానీ నీ తెలివి ఎక్కడికి వెళ్లింది. ముందు నేను కూడా మీలానే ఆలోచించా కానీ నిజం కాదు అనిపిస్తోంది. అవును తెల్లారి లేస్తే మురారి అక్కడే ఉంటున్నాడు. వాడు అక్కడికి వెళ్లకుండా కట్టడి చేయడం నీవల్ల కావడం లేదు. అక్కడికి వెళ్లినప్పుడు ఆ కృష్ణ నన్ను వేణి అని పిలవద్దు. కృష్ణఅని పిలవమని చెప్పొచ్చుగా
నందిని: అమ్మేంటి ముకుందని ఇలా గుడ్డిగా నమ్మబట్టే ఇది ఇలా రెచ్చిపోతుంది. మనుషుల్ని కాదు మనసుల్ని అర్ధం చేసుకోవాలి ఇది మా అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో. ఇంతలో భవాని, మధు అక్కడికి వస్తారు. కృష్ణకు ఇప్పుడు బాగుందని చెప్తారు. మురారి గురించి భవాని అడిగితే అక్కడే ఉంటాను అన్నాడని మధు చెప్తాడు. హాల్‌లో అందరూ కృష్ణ, మురారి గురించి ఆలోచిస్తుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.