Krishna Mukunda Murari Serial November 16th Episode: కృష్ణకు మురారి ఇచ్చిన రింగ్‌ను ముకుంద తనది అని అనడంతో కృష్ణ ఇచ్చేందుకు సిద్ధం అయిపోతుంది. కానీ ఆ రింగ్ కృష్ణ చేతి నుంచి రాదు. దీంతో మురారి నేను తీస్తా అంటాడు. కృష్ణ చేతిని మురారి తాకడం ఇష్టం లేక భవాని ఆ రింగ్ తనదగ్గరే ఉండనీ దానం ఇచ్చేశాం అనుకుందాం అంటుంది. దీంతో కృష్ణ చాలా బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మురారి తన పెద్దమ్మపై సీరియస్ అవుతాడు.
మురారి: ఎందుకు పెద్దమ్మ అలా హర్ట్ చేశారు
భవాని: నేనేం చేశా నాన్న.. అసలు నీకేం తెలీదు నువ్వేం మాట్లాడకు.
మురారి: అవును నాకేం తెలీదు.. అంటూ మురారి కోపంగా లోపలికి వెళ్లిపోతాడు
భవాని: పంతులు గారు దోష నివారణ పూజ ఇంకో రోజు పెట్టుకుందామా అని చెప్తే పంతులు ఓకే అని వెళ్లిపోతాడు
ముకుంద: అత్తయ్య మీ దగ్గర ఒక విషయం దాచాను. ఆ రింగ్ నిజంగా నాది కాదు. క్షమించండి అత్తయ్య మీకు ఇలాంటివి నచ్చవు అని ముందు మీకు ఇలా చెప్పలేదు. అది మురారి కొని స్వయంగా కృష్ణ వేలుకి తొడగడం నేను చూశాను. అందుకే అత్తయ్య పూజలో అందరి ముందు మురారి చేత ఒప్పించి మీ చేత చీవాట్లు పెట్టిస్తే ఇద్దరూ సరిగా ఉంటారని అనుకున్నాను. కానీ కృష్ణ తెలివిగా నింద తన మీద వేసుకొని మురారికి తన మీద మరింత ఇష్టం కలిగేలా చేస్తుంది అనుకోలేదు
భవాని: చూడు ముకుంద ఇలాంటివి ఇంకెప్పుడు నాకు చెప్పకుండా చేయొద్దు. అనవసరంగా మురారి ముందు నువ్వు బ్యాడ్ అయ్యావు. నాకు ముందు చెప్పకుండా నువ్వు ఇలా చేయడం నిజంగా చాలా తప్పు. ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను.
మరోవైపు కృష్ణను వాళ్ల పిన్ని పూజ ఎలా జరిగిందని అడిగింది. బాగా జరిగిందని కృష్ణ పిన్నికి చెప్తుంది. ఇక మనసులో అక్కడికి నువ్వు రాకపోవడమే బాగుంది పిన్ని వచ్చుంటే పెద్ద గొడవ జరిగేది అని అనుకుంటుంది. ఇక కృష్ణతో వాళ్ల పిన్ని మీ పెద్దత్తయ్య భవాని మురారి ముకుందకు పెళ్లి చేయాలని అనుకుంటుందని చెప్తుంది. అది తాను బతికి ఉన్నంత వరకు జరగదు అని కృష్ణ చెప్తుంది. ఇక నందిని అక్కడికి వస్తుంది.
నందిని: మా అమ్మ హాస్పిటల్‌లో మీరున్నప్పుడు అని గతంలో జరిగింది చెప్పి ఇది నిజమేనా అని అడుగుతుంది.
కృష్ణ: ఏసీపీ సార్‌కి ఆపరేషన్ ఎలా జరిగిందో నాకు తెలీదు. కానీ మా చిన్నాన్న నేరం ఒప్పుకొని జైలుకి వెళ్లడం మాత్రం నిజం. కానీ మా చిన్నాన్న ఆ పని చేయలేదు నందిని. పెద్దత్తయ్య కళ్లారా చూసింది అదే నిజం అని అనుకుంటున్నారు. అది అబద్ధం అని నిరూపించడానికి కొంచెం టైం పడుతుంది నందిని
నందిని: అందుకే కృష్ణ నేనేం మాట్లాడలేకపోతున్నాను. కానీ నేనొక విషయం చెప్తా. మా అమ్మకు మాత్రం నువ్వు అన్నా నీ వాళ్లు అన్నా కోపం ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు.
కృష్ణ: మీరేంటి సార్ భార్యను వదిలి ఉండలేకపోతున్నారా
నందిని: అబద్దాలు చెప్పకు గౌతమ్. క్యాంపులు అని వారాలు వారాలు బయటకు వెళ్తాడు కృష్ణ లోకల్‌గా చేసే సర్జరీలు చాలవు అని బెంగుళూరు, దిల్లీ తిరుగుతుంటాడు. ఇప్పుడు నీ దగ్గర బిల్డప్‌లు ఇస్తున్నాడు
గౌతమ్: ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా చెప్పు అది సరే మీరేంటి సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. మా అత్తయ్యకు మీమీద ఉన్న కోపం తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు కృష్ణ ఎందుకు మౌనంగా ఉంటున్నావు
కృష్ణ: అదే కనుక్కోవాలి గౌతమ్ నేను కనిపించకపోతే (అని కృష్ణ ఆపేస్తుంది. ఇంతలో నందిని ఓహో మేము మా అమ్మ దగ్గర చెప్పేస్తాం అనా ఆపేశావ్ అంటే అలా కాదు అని అప్పుడు చెప్పుంది) నేను కేసు గురించి బయటకు వెళ్తే ఆ ముకుంద ఏసీసీ సార్‌ని ఏం చేస్తుందో.. ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుందో అని భయం అందుకే ఇంత పెద్ద నింద భరిస్తూ ఏసీపీ సార్‌కి కాపలాగా ఉంటున్నాను. సరే భోజనం చేసి వెళ్లండి. అంటే వాళ్లు వద్దు అని వెళ్లిపోతారు.
ముకుంద: మనసులో… అత్తయ్య అన్నట్లు నేను మురారి దృష్టిలో బ్యాడ్ అయ్యానా. అలా చేయకుండా ఉండాల్సింది. అసలే కృష్ణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను చేసిన పనికి ఇంకా రెచ్చిపోతాడు. కృష్ణకు ఇంకా దగ్గర అవుతాడు ఇప్పుడు ఏం చేయాలి అని తాను కొట్టేసిన చీర తీసుకెళ్లి తిరిగి ఇచ్చేస్తే కొంచెం అయినా సెట్ అవుతుంది అనుకుంటుంది ఇంతలో మురారి అక్కడికి వస్తాడు
మురారి: నీకేమైనా పిచ్చా నిజంగా నువ్వు రింగ్ కొన్నావా అడిగేది నిన్నే నిజంగా కొన్నావా ఎందుకు తనంటే మీ అందరికీ అంత కక్ష. అందరి ముందు అలా అవమానించాలా
ముకుంద: వాళ్లు మనకు చేసిన దానికంటే నేను చేసింది తక్కువే మురారి. ఇది నిజం మురారి అత్తయ్య ఇంత ఇదిగా చెప్తున్నా ఇంత మందిని కాదని
మురారి: ఎంత మందిని అందరిలో నువ్వు నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా చెప్పు చెప్పలేవు ఎందుకుంటే వేణి గారి మీద కోపం నీకు పెద్దమ్మకు మాత్రమే అని అర్థం అయింది. మిగిలిన వారు వేణి గారిని మీ అంత హేట్ చేయడం లేదు. చూడు నేను గతం మర్చిపోయి ఉండొచ్చు. కానీ వర్తమానంలో కరెక్ట్‌గానే ఉన్నాను.
ముకుంద: మిగిలిన వారికి నీ మీద ప్రేమ లేదు ఏమో
మురారి: ఏం మాట్లాడుతున్నావ్ నా కన్నతల్లికంటే నీకే నా మీద ఎక్కువ ప్రేమ ఉందా.
ముకుంద: ఉంది నాకే కాదు మీ పెద్దమ్మకి కూడా ఎక్కువే ఉంది. ఎందుకో చెప్పనా మా అందరి కళ్ల ముందు జరిగింది అందరూ సాక్ష్యమే. కానీ మేము ఇద్దరం మాత్రంమే ఎందుకు నమ్ముతున్నాం వాళ్లు ఎందుకు నమ్మరు మురారి మాట్లాడవెందుకు మురారి. నువ్వు నిజం తెలుసుకొని మేమే కరెక్ట్ అనే రోజు వస్తుంది. బాబూ.. ఆవిడని మేము ఏం అనము చాలా ఒక్క నిమిషం నువ్వు బాధ పడుతున్నావ్ అని తెలిసి నేను పది షాపుల్లో తిరిగి ఈ చీర తెచ్చా. వెళ్లు వెళ్లి వేణి గారికి ఇచ్చిరా. ఏంటీ నమ్మ లేకపోతున్నావా ఇలాంటి చీర నేను కట్టుకునే ఉన్నాను కదా ఇంకేంటి అలా చూస్తున్నావు. సారీ మురారి వేణి గారిని చూస్తేంటే కోపం ఆగలేక అలా చేశాను. నీకు ఇంకో విషయం తెలుసా నువ్వు వేణి గారికి రింగ్ తొడగడం నేను చూశాను. అదే పెద్దత్తయ్య చూసి ఉంటే అసలే అత్తయ్య గారు నువ్వు తనతో అంత క్లోజ్‌గా లేవని చాలా బాధపడుతుంది. అలాంటిది ఆమె చూస్తే అందుకే అలా చేశా మురారి సారీ. వెళ్లి ఇచ్చేసి రా
మురారి చీర తీసుకొని కృష్ణ దగ్గరకు వెళ్తాడు. మరోవైపు నందిని అమెరికా వెళ్లకుండా ఉండాలి తన తల్లికి చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. మురారి ట్రీమెంట్ కోసం ఇక్కడే మంచిదని అమెరికా వద్ద అని చెప్పి ఆలోచించమని చెప్తుంది. ఇంతలో వరలక్ష్మి అనే ఫ్రెండ్‌తో భవాని ఫోన్‌లో మాట్లాడి మురారి వాళ్లని రెండు రోజుల్లో అమెరికా పంపిస్తానని చెప్తుంది. దీంతో నందిని, రేవతి ఫీలవుతారు.
కృష్ణ బాధ పడుతుంటే అక్కడికి మురారి వెళ్తాడు. మురారి ఇచ్చిన చీర తాను తేలేదని షాపులోనే మర్చిపోయానని కృష్ణ చెప్తుంది. మురారి అయితే పెద్దమ్మ తిడుతుందని మీరు కట్టుకోలేదని అనుకున్నానని చెప్తాడు. ఇక తాను తెచ్చిన చీర కృష్ణకు ఇస్తాడు. ఇది మీ దగ్గర ఉందా అని కృష్ణ అడిగితే. నిన్ను అవమానించినందుకు నేను బాధ పడ్డానని ముకుంద మళ్లీ కొని తెచ్చిందని చెప్పాడు. దీంతో కృష్ణ షాక్ అవుతుంది. ఇక మురారి కృష్ణకు సారీ చెప్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.