Homeవినోదంమిశ్రమ టాక్​లోనూ తగ్గని ‘జపాన్‘, తమిళంతో పోలిస్తే తెలుగులో ఓపెనింగ్స్ అదుర్స్

మిశ్రమ టాక్​లోనూ తగ్గని ‘జపాన్‘, తమిళంతో పోలిస్తే తెలుగులో ఓపెనింగ్స్ అదుర్స్


తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. కార్తీ మూవీ వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆవారా’ తెలుగులో ఓ రేంజిలో సక్సెస్ అందుకున్నాడు కార్తీ.  ఏకంగా 100 డేస్ ఆడి అప్పట్లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత కార్తీకి తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతుంది. తెలుగు హీరోలతో సమానంగా వసూళ్లు వస్తున్నాయి. రీసెంట్ గా ‘సర్దార్’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా ‘జపాన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నెగెటివ్ టాక్ లోనూ ‘జపాన్’ దూకుడు

అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ‘జపాన్‘ సినిమా దీపావళి కానుక‌గా నవంబరు 10న  విడుదల అయ్యింది. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.  ఈ చిత్రంలో కార్తీ వేషం, యాస, నటన అన్నీ బాగున్నాయని సినీ అభిమానులు వెల్లడించారు. అయితే, మార్నింగ్ షోలతో పోల్చితే మధ్యాహ్నం  తర్వాత షోలు మంచి ఆక్యుపెన్సీని సాధించినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా చాలా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయినట్లు సమాచారం.   

తమిళ్​తో పోల్చితే తెలుగు ఓపెనింగ్స్ బెస్ట్

ఇక తమిళనాడులో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేదు. చాలా చోట్ల పేలవంగా ప్రదర్శించబడింది. ఆక్యుపెన్సీ వారీగా చూస్తే తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో ఈ చిత్రానికి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మధ్యాహ్నం షోస్ నుంచి మ్యాట్నీ షోల వరకు చక్కటి ఆక్యుపెన్సీని అందుకుంది. ‘జపాన్‘ సినిమా విడుదలకు ముందు టీజర్,  ట్రైలర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో కార్తీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో నవ్వుల పువ్వులు పూయించారు. కానీ, దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్,  స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు అనిపించినా,  సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. కానీ, టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం విశేషం.

ఇక ‘జపాన్‘తో పాటుగా విడుదలైన ‘జిగర్ తండ డబుల్ ఎక్స్‘ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇతర తమిళ చిత్రాలలో పోల్చితే కార్తీ  ‘జపాన్‘ ఫర్వాలేదు అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘జపాన్‘ సినిమా మొదటి రోజు రూ. 2 నుంచి రూ.3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళం లో ఈమాత్రం వచ్చే అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం కార్ ‘ఖైదీ 2‘ సినిమా చేస్తున్నారు. 

Read Also: ‘జ‌పాన్’ కోసం కార్తీ ఇంత కష్టపడ్డారా- ఆకట్టుకుంటున్న మేకింగ్‌ వీడియో

 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments