Homeవినోదంమా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి - మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య

మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగకండి – మంత్రి కొండాపై నిప్పులు చెరిగిన నాగ చైతన్య


Naga Chaitanya Serious On Konda Surekha: నటి సమంతతో విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు అక్కినేని నాగ చైతన్య తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలు తనతో పాటు తన కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించాయన్నారు. తమ విడాకుల గురించి గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు వచ్చినప్పటికీ, కుటుంబంతో పాటు మాజీ భార్య మీద ఉన్న గౌరవం కారణంగా సైలెంట్ గా ఉన్నట్లు చెప్పారు. మంత్రి కొండా వ్యాఖ్యలు పూర్తి అబద్దం అంటూ మండిపడ్డారు. తమ రాజకీయ స్వార్థం కోసం సినీ నటులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం నిజంగా దారుణం అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు.   

కొండ వ్యాఖ్యలు క్షమించరానివి – నాగ చైతన్య

మంత్రి కొండా సురేఖ తమ విడాకుల గురించి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు నాగ చైతన్య. “కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆమె ప్రతి మాట వాస్తవానికి దూరంగా ఉంది. ఆమె వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఏ మాత్రం సహించలేం. మహిళగా ఉండి తోటి మహిళకు అండగా నిలబడాలి. అంతే కానీ, వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ మీడియాలో హైలెట్ కావాలని భావించడం నిజంగా సిగ్గుచేటు” అంటూ మడిపడ్డారు.

తల్లి వ్యాఖ్యలకు అఖిల్ సపోర్టు

అటు తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని అమల తీవ్రంగా ఖండించారు. ఒక మంత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దారుణం అన్నారు. రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ‘‘ఒక మహిళా మంత్రి  రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని టార్గెట్ చేసి మాట్లాడ్డం నిజంగా దారుణం. నా భర్త గురించి తప్పుడు మాటలు మాట్లాడం సిగ్గుచేటు. నాయకులు ఇంతలా దిగజారడం దారుణం. రాహుల్ గాంధీ గారు.. మీ నాయకులను కంట్రోల్లో ఉంచుకోండి. మహిళా మంత్రితో నా ఫ్యామిలీకి సారీ చెప్పిడంతో పాటు ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ ప్రజలను కాపాడండి” అంటూ ట్వీట్ చేసింది.  ఈ వ్యాఖ్యలను నటుడు అక్కినేని అఖిల్ తీవ్రంగా ఖండించారు. తల్లి సోషల్ మీడియా పోస్టును షేర్ చేస్తూ, ఆమె వ్యాఖ్యలకు సపోర్టు చేశారు. “అమ్మా.. మీరు చెప్పిన ప్రతి మాటకు నేను సపోర్టు చేస్తాను. కొంత మంది దయ్యాలు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిసార్లు సామాజిక విద్రోహులను డీల్ చేయక తప్పదు” అని రాసుకొచ్చారు.

అక్కినేని ఫ్యామిలీ న్యాయపోరాటం!

అటు ఇప్పటికే కొండా సురేఖ తన చేసిన వ్యాఖ్యలను నటి సమంత తీవ్రంగా ఖండించింది.  మంత్రి వ్యాఖ్యల విషయంలో అక్కినేని ఫ్యామిలీ అంతా ఏకతాటి మీదికి వచ్చింది. తన కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబం న్యాయ పోరాటం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Read Also: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే!

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments