Kalki 2898 AD Editor About Adipurush VFX: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాదిని ‘ఆదిపురుష్’ సినిమాతో మొదలు పెట్టారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో దారుణంగా విఫలం అయ్యింది. ఈ చిత్రంలోని VFX, పాత్రల చిత్రీకరణ తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఈ మూవీ తర్వాత రీసెంట్ గా ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD‘ అనే సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
‘ఆదిపురుష్’ VFX మీద ’కల్కి’ ఎడిటర్ మీద సెటైర్లు
తాజాగా ’కల్కి 2898 AD’ చిత్ర ఎడిటర్ విశాల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో VFX వర్క్స్ గురించి మాట్లాడిన ఆయన, ఓం రౌత్ ‘ఆదిపురుష్’ VFX మీద సెటైర్లు విసిరారు. ఇన్ స్టాలో తన ఫాలోవర్స్ ఇంటరాక్ట్ అయిన ఆయన, “గత VFX సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో VFX పనితీరు ఎలా ఉంది? ఎమైనా మెరుగుదల కనిపిస్తుందా? అని ఓ ఫాలోవర్ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన విశాల్ ‘ఆదిపురుష్’ VFXపై విమర్శలు చేశారు. ” గత 10 సంవత్సరాలుగా VFX మీద రీసెర్చ్ చేస్తున్నాం. ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాల VFXను సైతం పరిశీలించాం. దీని ఫలితాన్ని ‘కల్కి’లో చూస్తాము. ఇది మీ ‘ఆదిపురుష్’ కాదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
‘ఆదిపురుష్’ ట్రైలర్ తీవ్ర విమర్శలు
‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదలైనప్పుడు VFX, CGIపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ దెబ్బతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. మళ్లీ VFX రీ క్రియేట్ చేయించినా, ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ‘ఆదిపురుష్’ సినిమా అనడం కంటే వీడియో గేమ్ అంటే బాగుంటుందని పలువు విమర్శలు చేశారు. ఈ మూవీలోని డైలాగులు కూడా అంత బాగాలేవనే టాక్ వినిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించారు. సన్నీ శర్మ సహా పలువరు కీలక పాత్రలు పోషించారు. రూ. 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లు కూడా వసూళు చేయలేకపోయింది.
Also Read: విశ్వక్ ‘కల్ట్’ vs ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’- టైటిల్ వివాదం తప్పదా?
ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ చిత్రం 2024లో థియేటర్లలోకి రానుంది.
Read Also: రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుంది – మనసులో మాట చెప్పిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్