Homeవినోదంమన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం

మన హీరోలనూ వదలని డీప్‌ఫేక్ గాళ్లు, ఈ వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం


Deep Fake Rashmika: డీప్ ఫేక్ వ్యహారం సినిమా తారాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కొంత మంది కేటుగాళ్లు హీరోయిన్ల ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ నెట్టింట్లోకి వదులుతున్నారు. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ డీప్ ఫేక్ బారినపడ్డారు. జరా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియోకు ఏఐ టెక్నాలజీతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేశారు కొందరు దుండగులు. ఈ వీడియో నెట్టింట్లో వైలర్ అయ్యింది. అటు ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తున్న కత్రినా, రీసెంట్ గా టవల్ ఫైట్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ పైట్ ఫోటోను డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారు. టవల్ లో ఉండే కత్రీనా, లోదుస్తుల్లో కనిపించేలా ఎడిట్ చేశారు. రెండు రోజుల్లో ఇద్దరు హీరోయిన్లు డీప్ ఫేక్ బారినపడటం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంపై పలువురు సినీ తారలు స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టాలీవుడ్ హీరోలకూ డీప్ ఫేక్ తిప్పలు

ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోలో హీరోయిన్లు కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఉండటం విశేషం. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇందులో ఉన్నారు. టాలీవుడ్ లో నెపోటిజం గురించి అన్వేష్ (నా అన్వేషణ) అనే యూట్యూబర్ చేసిన వీడియోను కేటుగాళ్లు డీప్ ఫేక్ టెక్నాలజీతో ఓ వీడియోను క్రియేట్ చేశారు. ఇందులో స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం, విరాట్ కోహ్లీ, విజయ్ దళపతి ముఖాలను అణ్వేష్  ముఖానికి యాడ్ చేసి ఈ వీడియోను రూపొందించారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోలకు కూడా వదలరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు చాలా అద్భుతంగా ఎడిట్ చేశారంటూ సదరు వీడియో క్రియేటర్ పై మరికొంత మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒరిజినల్ వీడియోలో ఉన్న అన్వేష్ ఎవరు?

ఇక ఈ ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన అన్వేష్ అనే యూట్యూబర్. 2019లో ‘నా అన్వేషణ’ అనే ఓ యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచ యాత్ర మొదలు పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను చూడటమే కాదు, తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ చానెల్ కు 1.39 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు.        

Read Also: రష్మిక మార్ఫింగ్ వీడియో – భయమేస్తుందన్న చైతూ, మద్దతుగా మృణాల్, సాయి తేజ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments