Homeవినోదం'మన ఫ్యూచర్‌ సంగతేంటి భైరవ..' - ఆకట్టుకుంటున్న భైరవ & బుజ్జి ట్రైలర్..

‘మన ఫ్యూచర్‌ సంగతేంటి భైరవ..’ – ఆకట్టుకుంటున్న భైరవ & బుజ్జి ట్రైలర్..


Bhairava and Bujji Telugu Trailer Out: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘కల్కి 2898 AD’. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, స్టార్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేసన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో ఈ మూవీ రూపొందుతుంది. జూన్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ విడుదల కానుంది. దీంతో కల్కి అప్పుడే ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ మూవీ హిస్టరీలో ఎన్నడు లేని విధంగా కల్కి ప్రమోషన్స్‌ని భారీగా ప్లాన్‌ చేశాడు నాగ్‌ అశ్విన్‌.

ఈ క్రమంలో ప్రభాస్‌ బుల్లి ఆడియన్స్‌ని ఆకట్టుకునేందుకు కల్కిని ప్రీల్యూడ్‌ పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌లో ఓటీటీలో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. భైరవ అండ్‌ బుజ్జి ప్రీల్యూడ్ (Bhairava & Bujji Prelude) పేరుతో యానిమేషన్‌ సిరీస్‌‌ అమెజాన్‌ ప్రైంలో రేపటి (May 31) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ బుజ్జి అండ్‌ భైరవ ప్రీల్యూడ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. ఈ యానిమేటేడ్‌ భైరవ పాత్రకు స్వయంగా ప్రభాస్‌ డబ్బింగ్‌ ఇచ్చాడు. ఇక బుజ్జి పాత్రకు ‘మహానటి’ కీర్తి సురేష్‌ డబ్బింగ్‌ ఇచ్చింది. 

ఇందులో ఓ ఆపరేషన్‌లో భైరవ తన బుజ్జితో కలిసి పాల్గొంటాడు. ఒకటిన్నర నిమిషం నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టకుంటుంది. ఈ ట్రైలర్‌ భైరవ ఇంట్రడక్షన్‌ మొదలు అవుతుంది. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత రేపే నా ప్రమోషన్స్‌ అంటూ కీర్తి సురేష్‌ వాయితో బుజ్జిని పరిచయం చేశారు. ఆ వెంటనే మన ఫ్యూచర్‌ సంగతి ఏంటీ భైరవ అంటూ బుజ్జి డైలాగ్‌ రావడం.. ఆ తర్వాత Find Adventure.. Find Friendship.. Find Each Other om May 31st అంటూ టైటిల్‌ వేశారు. ఇక చివరిలో భైరవ, బుజ్జిల చూపించి ఈ సిరీస్‌పై ఆసక్తి పెంచారు. ప్రస్తుతం భైరవ అండ్‌ బుజ్జిల ప్రీల్యూడ్ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. 

Also Read: ‘పుష్ప 2’ సెకండ్ సాంగ్‌పై కాపీ ఆరోపణలు – ఆ సాంగ్‌ నుంచి లేపేశారా? దేవిశ్రీపై ట్రోల్స్‌

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments