Homeవినోదంమత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ -...

మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ – సత్య కామెడీ


Mathu Vadalara 2 movie X review in Telugu: ‘మత్తు వదలరా’ సినిమా సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ శుక్రవారం (సెప్టెంబర్ 13న) థియేటర్లలోకి వస్తోంది. అయితే… హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. హీరో శ్రీ సింహ కోడూరి బాబాయ్, ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి సహా కొంత మంది సినిమా చూశారు. మరి, సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ట్విట్టర్ టాక్ ఏంటి? సోషల్ మీడియాలో జనాలు ఏమంటున్నారు? అనేది తెలుసుకోండి.

మెగాస్టార్ చిరంజీవిని ఫుల్లుగా వాడేశారు
మెగాస్టార్ చిరంజీవికి ‘మత్తు వదలరా’ దర్శకుడు రితేష్ రాణా డై హార్డ్ ఫ్యాన్ ఏమో అని నెటిజనులు అంటున్నారు. ఎందుకంటే… ఆ సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చిరు రెఫరెన్సులతో ముగించారు. ఇప్పుడీ ‘మత్తు వదలరా 2’లో కూడా సేమ్ టు సేమ్ అని సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ‘ఎక్స్’లో జనాలు చెప్పే మాట. 

‘మత్తు వదలరా 2’ అంతా మెగాస్టార్ రెఫరెన్సులే అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చిరంజీవి స్క్రీన్ మీద వచ్చినప్పుడు రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రితేష్ రాణా అని పేరు వేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫోటో చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యామని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.

Also Read: పెళ్లికి ముందు కండిషన్స్ పెట్టిన అక్కినేని ఫ్యామిలీ? – అందుకు శోభిత నో చెప్పడం వెనుక రీజన్ అదేనా?


సినిమా సూపర్… శ్రీ సింహ బెస్ట్ ఇచ్చాడు!
‘మత్తు వదలరా 2’ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా అయ్యిందో తెలియలేదని, సినిమా సూపర్ ఉందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. శ్రీ సింహ బెస్ట్ ఇచ్చాడని, మూవీ బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నాడు. 

హిలేరియస్ కామెడీతో సత్య… మెయిన్ హీరో!
‘మత్తు వదలరా’కు వెరీ గుడ్ సీక్వెల్ ‘మత్తు వదలరా 2’ అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ బావుందని సత్య హిలేరియస్ కామెడీ చేశాడని పలువురు పేర్కొన్నారు. సినిమాకు మెయిన్ హీరో సత్య అని కొందరు చెప్పడం విశేషం. ఒక నెటిజన్ అయితే సత్య కోసం టికెట్స్ బుక్ చేసుకోమని చెప్పాడు.

Also Readపూజా హెగ్డే దెయ్యంగా మారితే… సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంఛైజీలో బుట్టబొమ్మ పాత్ర అదేనా?


‘మత్తు వదలరా 2’ డీసెంట్ వాచ్ అని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. ఫన్ ఫిల్మ్ అని, సినిమాలో చాలా నవ్వులు ఉన్నాయని, వీకెండ్ మంచి ఆప్షన్ అని మరొక నెటిజన్ చెప్పాడు. మెగా అభిమానులకు మాత్రం ఈ సినిమా పండగ అని చాలా మంది చెబుతున్నారు.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments