Homeవినోదంమతాలు మార్చేస్తారు, సంబంధాలు కలిపేస్తారు... 'ఏఐ' (Artificial Intelligence)తో జాగ్రత్త

మతాలు మార్చేస్తారు, సంబంధాలు కలిపేస్తారు… ‘ఏఐ’ (Artificial Intelligence)తో జాగ్రత్త


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన భార్య గౌరీ మతం మార్చేశారు. పూర్తిగా ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో వారిద్దరూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో రెండు రోజుల క్రితం వైరల్ అయింది. చాలా మంది దీన్ని నమ్మారు కూడా. కట్ చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎవరో తుంటరి చేసిన ఇమేజ్ గా రుజువైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) అనేది మనుషులు చేసే చాలా పనులను సులభతరం చేయడానికి కనిపెట్టిన సాధనం అయినా దానిలోని డార్క్ సైడ్ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఈ ఒక్క ఇన్సిడెంట్ కే పరిమితం కాలేదు

శ్రీదేవితో రామ్ గోపాల్ వర్మ డేటింగ్
ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో  ఆయన బహాటంగానే చాలాసార్లు చెప్పారు. సడన్గా నిన్నటి నుంచి  సోషల్ మీడియాలో  RGV తో దివంగత శ్రీదేవి డేటింగ్ వీడియో అంటూ ఒక క్లిప్ వైరల్ అవుతోంది. స్వయంగా ఆర్జీవినే AI అలా టూ మచ్ అంటూ ఆ క్లిప్ షేర్ చేశారు. 

హార్దిక్ పాండ్యతో జాన్వి కపూర్ డేటింగ్
తాజాగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తో   బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్  డేటింగ్ లో ఉందంటూ కొన్ని ఫోటో లు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన చాలామంది నిజం అనుకుని షేర్ చేస్తున్నారు. కట్ చేస్తే అవి కూడా AI ఉపయోగించి చేసిన ఫేక్ ఫోటోలుగా తేలింది.

ఒకప్పటి మార్ఫింగ్… ప్రస్తుతం AI
కొంతకాలం క్రితం హీరోయిన్ రష్మిక ఫేక్  వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియో ఫేక్ వీడియో అని తరువాత తేలింది. దానిపై చర్యలు తీసుకునే సమయానికి  చాలామందికి చేరిపోయిన పరిస్థితి. దానిని డీప్ ఫేక్ వీడియో గా పేర్కొన నిపుణులు చాలామంది సెలబ్రిటీలు వీటి బారిన పడినట్టు తేల్చారు. మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా ఇలాంటి పనులు చేస్తుంటారు  సైబర్ నేరగాళ్ళు. అయితే ఇదేదో సెలబ్రిటీలకే పరిమితం అనుకుంటే  మీరు పొరపాటు పడినట్టే.

Also Read‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ: కామెడీ ఒక్కటేనా – కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?

వాళ్ల టార్గెట్ మధ్య తరగతి ప్రజలే!
అక్రమ లోన్ యాప్ నిర్వాహకులు, కాల్ మనీ  కేటుగాళ్ళు ఇంతవరకూ ఇలా డీప్ ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ ఇమేజ్ లతో ఎంతోమంది మధ్యతరగతి స్త్రీలను వేధించిన సంఘటనలను టీవీలో న్యూస్ లో చూసేవాళ్ళం. చాలామంది పోలీసులకు రిపోర్ట్ చేస్తే కొంతమంది అవమానభారంతో తీవ్ర నిర్ణయాలు తీసుకున్న సంఘటనలనూ చూసాం. అలాంటి వాళ్ళ చేతుల్లోకి  ఇప్పుడు ఏAI వచ్చేస్తుంది. దానికి నిదర్శనం పైన చెప్పిన మూడు సంఘటనలే. ఇంతవరకు సెలబ్రిటీల ఫేక్ ఇమేజ్ లకు మాత్రమే పరిమితమవుతున్న  AI వల్ల రేపటి రోజున సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోలేదు. టెక్నాలజీని ప్రమాదకర రీతిలో వాడే నేరగాళ్ల వల్లే  ఈ సమస్య అంతా. దీనిపై పై ప్రభుత్వాలు, పోలీసులు ఒకవైపు దృష్టి పెడుతున్నా మనం కూడా తగు జాగ్రత్తలో ఉండాలి. ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఎలాంటి ఫోటో అయినా వీడియో అయినా సెలబ్రిటీలకు సంబంధించిన డైనా లేక మనకు తెలిసిన వాళ్లకు  సంబంధించినదైనా వెంటనే నమ్మొద్దు. వాటిని వెంటనే డిలీట్ చేయడమో లేక రిపోర్ట్ చేయడమో వీలైతే పోలీసులకు రిపోర్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ సైబర్ నేరగాళ్ళకి చెక్ పెట్టొచ్చు అని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు.

Also Readనవ్వించే ప్రయత్నమే… మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు – అన్షుపై కామెంట్స్‌ & రేవంత్ రెడ్డి – బన్నీ ఇష్యూలో సారీ చెప్పిన త్రినాథరావు నక్కిన

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments