Mohan babu complaint against his son Manoj Manchu and Monika Manchu | హైదరాబాద్: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని మొదట నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆపై మోహన్ బాబు సైతం తన ప్రాణలకు ముప్పు ఉందని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల అంశం మరో మలుపు తీసుకుంది.
తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు.
ఇంతకుముందే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
మరిన్ని చూడండి