Homeవినోదంభారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి హీరోలు - మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెంకటేష్, రానా

భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి హీరోలు – మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెంకటేష్, రానా


ప్రకృతి విపత్తులు తలెత్తిన ప్రతిసారీ ప్రజలకు అండగా మేమున్నామంటూ తెలుగు చలన చిత్ర సీమ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు పలుసార్లు భారీ విరాళాలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగి, వరదలు రావడంతో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వాలు చేపట్టిన సహాయక చర్యలకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు భారీ విరాళాలు ప్రకటించారు. ఆ జాబితాలో దగ్గుబాటి హీరోలు సైతం చేరారు. 

ఏపీ, తెలంగాణకు దగ్గుబాటి ఫ్యామిలీ విరాళం కోటి
ఉభయ తెలుగు రాష్ట్రాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలకు తాము కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు వెంకటేష్, రానా దగ్గుబాటి ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

Also Readతమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్… బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!

రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్!
తెలుగు చిత్రసీమలో అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలియజేసింది.

Also Readహీరోయిన్లూ… బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి – కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?

వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సాయం!
విజయవాడలోని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అభిమానులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 800 మంది ప్రజలకు తాగు నీరు, ఆహారం అందించారు. 

Also Readవిజయ్ ‘ది గోట్’కి సీక్వెల్… పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షల విరాళం ప్రకటించింది.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments