Homeవినోదంభవానిని రెచ్చగొట్టేసిన దేవ్.. ఏడుస్తూ వెళ్లిపోయిన కృష్ణ!

భవానిని రెచ్చగొట్టేసిన దేవ్.. ఏడుస్తూ వెళ్లిపోయిన కృష్ణ!


Krishna Mukunda Murari Serial Today Episode

రేవతి: విన్నావు కదరా మధు.. ముకుంద ఇంట్లో వాళ్ల మాట కూడా వినడం లేదట.
మధు: ఆ మాట పక్కన పెడితే ముకుంద తనకు అన్న ఉన్నట్లు శ్రీనివాస్‌గారికి కొడుకు ఉన్నట్లు ఇంతవరకు మనకు ఎందుకు చెప్పలేదు.
రేవతి: నీ మొహం శ్రీనివాస్ అన్నయ్యని మనతో తీరికగా కూర్చొని మాట్లాడే అవకాశం ఎప్పుడు ఇచ్చింది ముకుంద.
మధు: అది నిజమేలే.. హాయ్ మురారి కేసు ఎంత వరకు వచ్చింది. 
మురారి: ఓ కొలిక్కి వచ్చినట్లే నేను కృష్ణ మాట్లాడుకుంటున్నప్పుడు దేవ్ అదే ముకుంద బ్రదర్ నా దగ్గరకు ముకుందను తీసుకొచ్చాడు. 
మధు: ఏం అన్నాడు అటు ఇటూ చూసి టక్కున కాళ్లు పట్టుకొని నా చెల్లిని పెళ్లి చేసుకో అన్నాడా..
మురారి: దానికి ఫుల్లుగా రివర్స్ అనుకో..అని దేవ్ మాటలు చెప్తాడు. ఈ కేసులో కోపరేట్ చేస్తా అన్నాడు. 
రేవతి: ఏం కేసో ఏంటో వచ్చే శుక్రవారం లోపు ఇవన్నీ తేలకపోతే.. 
మురారి: అమ్మా.. ఆ దేవ్ ముకుందను ఇంటికి తీసుకెళ్తాడేమో కానీ పెళ్లి మాత్రం చేయడు. ఆ నమ్మకం నాకు ఇచ్చాడు. అలా అని నేను రిలాక్స్ అవ్వను. 
రేవతి: నిజంగా ఆ దేవ్‌కు చెల్లిమీద అంత ప్రేమ ఉందా. అయితే నువ్వు ఎటూ కేసు చూస్తున్నావ్ ఆ అబ్బాయిని ఆదర్శని వెతకడానికి వెళ్లమని చెప్పొచ్చు కదా. 
మురారి: ముకుంద ఎలా ఊరుకుంటుంది. తెలియకుండా వెళ్లడం కష్టం. వాళ్ల నాన్న గారు కూడా ఇంట్లో లేరంట. మరి చెప్పకుండా ఎలా వెళ్తాడు. ఆదర్శ్ రాడు అమ్మా. కృష్ణ ఏదో వస్తాడు అంటుంది కాదు. నాకు అయితే నమ్మకం లేదు.

 మరోవైపు దేవ్, కృష్ణ కలిసి మురారి ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తారు. దేవ్ ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తాడు. ఇంతలో మురారి కృష్ణతో ఓ గెస్ట్‌ అంతే ఇతనేనా.. అని అంటాడు. ఇక రేవతి మనసులో అక్కయ్య ఏం అంటుందో ఏంటో అని అనుకుంటుంది. మరోవైపు ముకుంద మనసులో దేవ్‌ని ఉద్దేశించి వీడి ఓవర్ యాక్షన్ ఎటు దారితీస్తుందో ఏంటో అని అనుకుంటుంది. 

దేవ్: మేడమ్ నేను మా చెల్లి కృష్ణ కలిసి మనందరికీ చేపల పులుసు చేశాం. మా బావకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అంట కదా. కృష్ణ చెప్పింది. 
మురారి: మనసులో.. ఎలాంటి రచ్చ జరగకముందే నేనే ఏదో ఒకటి చేయాలి. దేవ్ థ్యాంక్యూ. ఫిష్ కర్రీ తిని చాలా రోజులు అయింది. 
కృష్ణ: సారీ పెద్దత్తయ్య చేపల పులుసు ఇవ్వడానికి మాత్రమే వచ్చాను ఇచ్చేసి వెళ్లిపోతాను. 
మురారి: కృష్ణ నువ్వు ఈ ఇంటికి రావొచ్చు వెళ్లొచ్చు అని చెప్పాను కదా దానికి నవ్వు ఏదో తప్పు చేసినట్లు.
భవాని: తప్పే చేసింది. ముమ్మాటికి తప్పు చేసింది. అసలు మన ఇంటి పరువు తీసి మనస్శాంతి లేకుండా చేసిన ఈ కృష్ణని మీరంతా ఎలా అంగీకరిస్తున్నారో. నీకు అంత పెద్ద యాక్సిడెంట్ చేసి నీ రూపాన్నే మార్చేసిన వారిని నువ్వు అంత తేలికగా క్షమించేశావేమో మురారి నేను క్షమించలేను. ఈ ఇంట్లో క్రమశిక్షణకు అర్థం లేకుండా పోయింది. నువ్వు వచ్చిన తర్వాతే వాళ్లు మారారు. 
రేవతి: అక్కయ్య వదిలేయ్. కృష్ణ వెళ్లు చేపలు పులుసు వద్దు ఏం వద్దు నువ్వు తీసుకెళ్లు దేవ్.
దేవ్: నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా.. కృష్ణ మంచిది అనేది పచ్చి నిజం. భార్యాభర్తల బంధాన్ని మీరు తప్పగా..
భవాని: షట్‌అప్ ఆ మాటకి వాళ్లిద్దరూ అర్హులు కారు. అవును వీళ్లది అగ్రిమెంట్ పెళ్లి. గౌరవప్రదమైన మా వంశ గౌరవం ఎక్కడ బయటపడుతుందో అని వీళ్ల దారుణాన్ని క్షమించాను. 
మురారి: పెద్దమ్మ ప్లీజ్.. 
దేవ్: బావ కృష్ణని నమ్ముతున్నాడు. మీరు దాని గురించి తెలీక ముందు కృష్ణని యాక్సెప్ట్ చేశారు కదా. 
భవాని: అదే నేను జీవితంలో చేసిన మొదటి తప్పు. మళ్లీ వీళ్లని క్షమించి రెండో తప్పు చేయలేను. 
మురారి: ఇక్కడ అందరూ ఆ కేసు గురించి మర్చిపోండి నేను చూసుకుంటా కదా. 
భవాని: ఏం చూసుకుంటావ్ మురారి. కేసు క్లోజ్ చేసి ఆ జనాల్ని చూసుకుంటావా.. ఇదే కదా నువ్వు చూసేది. 
కృష్ణ: నా గురించి మీరందరూ గొడవ పడకండి నేనే వెళ్లిపోతాను.
దేవ్: కృష్ణ ఎక్కడికి నువ్వు నేరస్తురాలివి అని తెలిసే వరకు నువ్వే ఈ ఇంటి కోడలివి. ఒకవేళ నేరం రుజువు అయినాక అప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం ముకుంద ఈ ఇంటి కోడలు అవుతుంది. అప్పుడు దాక నువ్వు ఈ ఇంటి కోడలివే. అప్పటి దాకా ఏంటి ఎటూ ఈ కేసులో నువ్వు నిర్దోశివి అని తేలుతుంది. దీంతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వే కోడలివి.
భవాని: ఆపు దేవ్.. ఈ ఇంటి కోడలు ఎవరూ అని చెప్పాల్సింది నిన్నా మొన్న వచ్చిన నువ్వు కాదు. ఏం తెలుసు నీకు ఏం తెలీకుండానే మనుషుల్ని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు.
ముకుంద: దేవ్ నోరు మూసుకొని ఉండలేవా. అయినా సొంత చెల్లి నన్ను చూడ్డానికి వచ్చినవాడివి ఇలా అవుట్ హౌస్‌లోనూ ఇంకెక్కడో ఉన్నవారి కోసం..
దేవ్: అవుట్ హౌసో ఇంకెక్కడో అసలు నువ్వు పెళ్లి అయిన వాడి ప్రేమలో పడకపోతే..
భవాని: దేవ్.. ఇప్పటి దాకా ముకుందకు అన్నయ్యవి అన్న గౌరవంతో ఇప్పటి వరకు ఏం అనడం లేదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చనువు తీసుకున్నావు ఇక చాలు. ఇప్పుడు చెప్తున్నా విను నేరం రుజువు అవుతుంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ఇంటి కోడలు.. మురారి భార్య ముకుందనే. నాకు ఆ నమ్మకం ఉంది నమ్మకం ఎప్పుడూ ఒమ్ముకాలేదు. వచ్చిన వాళ్లు వచ్చిన దారినే వెళ్లొచ్చు. 

ముకుంద: ఎందుకు దేవ్ నవ్వుతున్నావు. చెప్పు.
దేవ్: ఇందాక మీ అత్త దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తూ కృష్ణని పొగిడాను కదా. అవన్నీ నిజాలే అనిపించాయి ముకుంద లేకపోతే అంత ఫ్లో ఎలా వస్తుంది చెప్పు.
ముకుంద: ఏంటి జోకా. అవన్నీ నిజాలే కావొచ్చు నేను ఒప్పుకుంటాను కానీ. మురారి కృష్ణతో ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. 
దేవ్: నేను ఒప్పుకోను అనుకో. అయినా వాళ్లది అగ్రిమెంట్ పెళ్లి అని తెలిసి మీ అత్త దగ్గర నువ్వు ఇన్నాళ్లు దాచావ్ చూడు అది మాత్రం కచ్చితంగా నీ తప్పే ముకుంద. 
ముకుంద: టైం కోసం వెయిట్ చేశా దేవ్. నేను నా కోసం ఆ విషయాన్ని కరెక్ట్ టైంలోనే బ్లాస్ట్ చేశాననుకుంటున్నా దేవ్. 
దేవ్: కరెక్టే నువ్వు అప్పుడు కాకుండా ఇంకెప్పుడో జరిగుంటే యాక్సిడెంట్ కావడం గతం మర్చిపోవడం నేను కెన్యా నుంచి రావడం ఇవన్నీ జరిగేవి కాదు. సో నాకు ఎందుకో నీకు మురారికి పెళ్లి గ్యారెంటీగా జరుగుతుంది అనిపిస్తుంది. 
ముకుంద: నిజమేరా దేవ్ నువ్వు రావడం కృష్ణ మురారిలకు అండగా ఉన్నట్లు నటించడం అది మాత్రం హైలెట్. ఇక ఇప్పట్లో నువ్వు నేను చెప్తే తప్ప ఎవరికీ నీ గురించి చెప్పక్కర్లేదు. కానీ.. ఒక వేళ మా పెళ్లి అయ్యాక నీ విషయం తెలిసిందే అనుకో. అగ్రిమెంటో అరెంజ్‌నో కృష్ణ, ముకుందలకు పెళ్లి కాలేదో అత్తయ్య విడదీయడం లేదా.. అసలే ఆ మురారి కనీసం ఒక రెండు నిమిషాలు కూడా నాతో  మాట్లాడటం లేదు. 
దేవ్: నేను మీ పెళ్లి అయ్యాక నా దారిన నేను కెన్యా వెళ్లి పోతే ఆ శ్రీనివాస్‌ని ఇంట్లో దిగబెట్టి వెళ్లిపోతా. చూడు ముకుంద నువ్వు ఏ టెన్షన్ పడకు. పెళ్లి అయ్యాక నువ్వు అమెరికా వెళ్లిపో ఇక పెళ్లికి ముందు నా గురించి బయట పడినా నువ్వేం భయపడకు. 
ముకుంద: బయట ఎందుకు పడుతుంది దేవ్.. 
దేవ్: చెప్పలేం కదా.. ఏం జరిగినా ఎటాక్ చేయడానికి రెడీ గా ఉండు. ఇక నేను వెళ్తున్నా గుడ్ నైట్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments