Brahmamudi Serial Today Episode: కావ్య ఎమోషనల్ గా ఫీలవుతూ రాజ్ తనతో ప్రేమగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఎవరి కోసమో నన్ను ఇంట్లో ఉండనిచ్చి.. నాకు అన్నం పెట్టినందుకు మీకు శతకోటి వందనాలు మహాప్రభో. నాకు అస్థిత్వం లేని ఈ ఇంట్లో.. ఇంకా.. నేనెందుకు ఉండాలి. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మర్యాదగా నేను వెళ్లిపోవడమే నాకు మంచిది.. మీకు మంచిది. అని కావ్య వెళ్ళిపోతుంది. ఎవరు ఆపినా ఆగదు. కావ్యను ఆపమని సీతారమయ్యకు ఇందిరాదేవి చెబితే కౌరవ సభలో దృతరాష్ట్రుడిలా అయిపోయానంటాడు సీతారామయ్య. కావ్య గతమంతా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య ఏడుస్తూ ఒక్కతే ఇంటికి రావడం చూసిన కృష్ణమూర్తి, కనకం షాక్ అవుతారు. ఏమైందని అడుగుతారు.
కనకం: ముందు లోపలికి రా అమ్మ కావ్య.
కావ్య: నేను ఇంట్లోకి రావాలంటే మీ అనుమతి కావాలి. నేను పండగకో పబ్బానికో రాలేదు. నేను అత్తింటి గడప దాటి వచ్చాను. నాకు ఇంకో దారిలేదు. మీ కూతురు పుట్టెడు దుఖాన్ని గుండెల్లో దాచుకుని పుట్టింటికి వచ్చిందమ్మా. నేనుండటానికి కాస్తా చోటు ఇస్తారా..
కృష్ణమూర్తి: అమ్మా కావ్య అలా పరాయిదానిలా అడుగుతున్నావేంటమ్మా..? ఇది నీ ఇల్లు.
కావ్య: పుట్టిపెరిగినంత మాత్రనా నా ఇల్లు అవుతుందా నాన్నా.. పెళ్లి చేసి పంపించారు. అత్తారిల్లే నా ఇల్లు. కానీ, ఇప్పుడు అది కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చాను.
కనకం: మేము నిన్ను అమ్ముకోలేదు. నీకు ఎంతో కష్టం వస్తేనే.. ఆ ఇల్లు వదిలి వచ్చింటావు.
కృష్ణమూర్తి : ఇది పేరుకే నా ఇల్లు. కానీ దీన్ని నిలబెట్టింది నువ్వే తల్లి. ఈ ఇల్లుమీద నాకంటే నీకే ఎక్కువ హక్కు ఉందమ్మా..
అంటూ ఏడుస్తూ ఇద్దరు కావ్యను ఇంట్లోకి తీసుకెళ్తారు. జరిగిన విషయం అడిగి తెలుసుకుటారు. మరోవైపు కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఇంటికి వచ్చి రాజ్ ను కోపంగా పిలుస్తాడు. రాజ్ ఏం కావాలని అడుగుతాడు. రాయబారానికి వచ్చావా? రాజీ కుదర్చడానికి వచ్చావా? అసలు నీ దగ్గర ఏముందని వచ్చావు అంటాడు. దీంతో నా దగ్గర నా భార్య ఉంది. నీ దగ్గర నీ భార్య ఉందా? అంటూ ప్రశ్నిస్తాడు కళ్యాణ్.
రాజ్: ఆమె వచ్చి తన గోడు నీతో చెప్పుకుందా..?
కళ్యాణ్: ఆమె చెప్పుకునేదే అయితే ఈ కౌరవ సభలోనే చెప్పుకునేది కదా. అయినా నువ్వు వదినను ఎందుకు అవమానించావు. వెళ్తుండగా ఎందుకు ఆపలేదు.
రాజ్: ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిపోయినదాన్ని పట్టించుకోవాలనుకోవట్లేదు.
కళ్యాణ్: నేను కూడా అలాగే వెళ్లిపోయాను. మరి నన్నెందుకు పట్టించకున్నావు. నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలిని చీకట్లోకి పంపేవరకు దిగజారిపోయిందా నీ ఔన్నత్యం.
అని కల్యాణ్ ప్రశ్నిస్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుపడుతుంది. దీంతో నీకు మాట్లాడే హక్కే లేదు. అసలు నీవు తల్లివేనా? అని అడగడంతో అందరూ షాక్ అవుతారు. కావ్య గురించి కావ్య చేసిన త్యాగాలు గురించి చెప్తూ కళ్యాణ్ ఎమోషన్ అవుతాడు. ఆ మందర మాటలు నమ్మి వదినను వెళ్లగొట్టావా? లేక ఈ కైకేయి మాట పట్టుకుని వదినను దూరం చేసుకున్నావా? అని కళ్యాణ్ అనడంతో రాజ్ కోప్పడతాడు. కవిత్వం వేరు వాస్తవికం వేరు. అయినా అమ్మ చావుబతుకుల్లో ఉంటే.. దానికి కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ.. మన బ్లడ్ రిలేషన్ నే అనుమానిస్తున్నావా? కళ్యాణ్ అంటూ రాజ్ ఎమోషన్ అవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను చీ కొట్టిన నక్షత్ర – భూమికి ఐ లవ్యూ చెప్పిన చెర్రి
మరిన్ని చూడండి