Brahmamudi Serial Today Episode: ధాన్యలక్ష్మీ బెడ్ రూంలోంచి గెంటి వేయడంతో ప్రకాష్ దుప్పటి కప్పుకుని రాజ్ రూం దగ్గరకు వెళ్లి డోర్ కొడతాడు. లోపల ఉన్న రాజ్ ఆశ్చర్యంగా సుభాష్‌ను చూస్తుంటే.. నేను నీ పెళ్లాం అనుకున్నావారా..? వెళ్లి నువ్వే డోర్ తీయ్ అంటాడు. రాజ్ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి బాబాయ్ ఇక్కడున్నావు అని అడుగుతాడు. నీ రూంలో పడుకోవడానికి వచ్చాను అంటాడు ప్రకాష్. నువ్వా ఇక్కడా.. అంటాడు రాజ్ నేనే ఇక్కడే పడుకుంటాను అంటూ వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు ప్రకాష్. బయట కూర్చుని ఆలోచిస్తున్న కావ్య దగ్గరకు అపర్ణ వస్తుంది. అపర్ణకు ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది.
అపర్ణ: చెప్పండి అత్తయ్యగారు
ఇందిర: ఏం చెప్పమంటావు నువ్వేమో నీ కొడుకు మీద అలిగి పుట్టింటికి వెళ్లినట్టు నీ కోడలి ఇంట్లో కూర్చుని సంతోషంగా అది చేసి పెట్టే వంటలు తింటూ హాయిగా ఉన్నావు. కానీ నా పరిస్థితే దారుణంగా ఉంది.
అపర్ణ: ఏమైంది అత్తయ్యా
ఇందిర: ఏమవ్వడం ఏంటి..? ఇన్నాళ్లు నువ్వు నా బాగోగులు చూసుకునే దానివి. కావ్య వచ్చాక నాకు ఏ లోటు రాకుండా సాగింది. ఇప్పుడు మీరిద్దరూ ఇంట్లో లేకపోయే సరికి నన్ను పట్టించుకునే వారు లేకుండా పోయారు.
అపర్ణ: అదేంటత్తయ్యా నా కొడుక్కి బుద్ది చెప్పడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు.
ఇందిర: ఏంటో ఈ గొడవలు వీలైనంత త్వరగా వాణ్ని మార్చి మీరిద్దరు ఇక్కడికి వచ్చేయండి. ఇళ్లంతా బోసి పోయినట్టు ఉంది.
అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇందిరదేవి.
కావ్య: అత్తయ్యా ఈ మధ్య మీరు కూడా అబద్దాలు బాగానే ఆడుతున్నారు. అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారు.
అపర్ణ: ఏంటి నేను చేసిన అబద్దపు వాగ్దానాలు.. నా కొడుకుతో గొడవ పడి ఇంత దాకా వస్తే నీకు వెటకారంగా ఉందా..? మీరు మీరు కొట్టుకుని బాగానే ఉన్నారు. కానీ మిమ్మల్ని కలపడానికి నేను చస్తున్నాను.
అంటూ అపర్ణ తిట్టగానే కావ్య కామ్ గా ఉండిపోతుంది. మరోవైపు సుభాష్, ప్రకాష్ తమ గురకతో రాజ్ కు నిద్ర లేకుండా చేస్తారు. రాజ్ ఇరిటేటింగ్ గా ఇద్దరిని నిద్ర లేపి వెళ్లి మీమీ రూముల్లో పడుకోండని చెప్తాడు. దీంతో సుభాష్ మీ అమ్మను తీసుకురా నేను నా రూంలోకి వెళ్తాను అంటాడు. ప్రకాష్ కూడా మీ పిన్ని కన్వీన్స్ చేయ్ రాజ్ నేను వెళ్లిపోతాను అంటాడు. దీంతో రాజ్ వాళ్లను కన్వీన్స్ చేయడం కన్నా నేనే కింద పడుకోవడం బెటర్ అనుకుని చాప వేసుకుని కింద పడుకుంటాడు రాజ్. వీడిని ఇలా టార్చర్ పెడితే కావ్యను తీసుకొస్తాడనుకుంటే ఇలా పడుకున్నాడేంటి..? రేపటి నుంచి డోస్ మరింత పెంచాలి అని మనసులో అనుకుంటాడు సుభాష్. సీతారామయ్య దగ్గరకు ఇందిరాదేవి వెళ్లి బాధపడుతుంది.
ఇందిర: ఏంటి బావ ఇది కావ్య ఆఫీసులోంచి వెళ్లిపోయింది. అపర్ణ ఇంట్లోంచి వెళ్లిపోయింది. కానీ నువ్వేమీ పట్టనట్టు తాపీగా పేపర్ చదువుతున్నావు.
సీతారామయ్య: ఏం చేయమంటావు చెప్పు కావ్య ఆఫీసుకు రానంటుంది. రాజ్ నా మాట వినడం లేదు. కనీసం అపర్ణ అయినా తల్లిగా ఏదో ప్రయత్నం చేస్తుంది కదా..? చేయనివ్వు.
ఇందిరాదేవి: కానీ రాజ్‌ను ఇలాగే వదిలేస్తే.. వాడికి ఎవ్వరి అవసరం లేదన్నట్టు ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంటాడు.
సీతారామయ్య: మరేం చేయమంటావు.
ఇందిర: నువ్వు మళ్లీ పందెమే పెడతావో.. వాడి పొగరుకు కళ్లేమే వేస్తావో నాకు తెలియదు.. వాడు తిరిగి తల్లితో పాటు కావ్యను కూడా తీసుకొచ్చేలా నువ్వే చేయాలి.
అంటూ పక్కనే ఉన్న టాబ్లెట్స్ చూసి నువ్వు ఇంకా ఈ టాట్లెట్ వేసుకోలేదా..? బావ అని అడుగుతుంది ఇందిరాదేవి. ఇంతవరకు నాకు పాలు ఇవ్వలేదని అందుకే టాబ్లెట్ వేసుకోలేదని చెప్తాడు సీతారామయ్య. దీంతో కోపంగా కిచెన్ లోకి వెళ్లిన ఇందిరాదేవి అక్కడ ధాన్యలక్ష్మీ పాలు కలపడం చూసి మీ మామయ్యకు ఇంత లేటుగా పాలు ఇస్తారా..? అంటూ అక్కడున్న పాలు తీసుకొళ్తుంటే ధాన్యలక్ష్మీ అవి మామయ్యకు కాదని తనకని చెప్తుంది. మీ మామయ్య గురించి పట్టించుకునే బాద్యత నీకు లేదా..? అంటూ ఇందిరాదేవి నిలదీయడంతో రుద్రాణి వస్తుంది. ఇద్దరూ కలిసి ఇందిరాదేవిని ఘోరంగా అవమానిస్తారు. అంతా విన్న రాజ్ కోపంగా ఏంటి పిన్ని ఇది అంటూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏం మాట్లాడుతున్నారు అంటూ ఇద్దరిని తిడతాడు. మరోవైపు కళ్యాణ్ రైటర్ ఇచ్చిన చెక్ తీసుకొచ్చి అప్పుకు ఇస్తాడు. అప్పు ఆనందంతో పొంగి పోతుంది. నీకు ఇష్టమైన రంగంలో జీవితం ఆరంభించావని ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
మరిన్ని చూడండి