Homeవినోదంబే అంటూ నోరు జారిన నిఖిల్... సంచాలక్‌గా ప్రేరణ పక్షపాతం... ఓట్ అప్పీల్ టాస్క్ పూర్తి

బే అంటూ నోరు జారిన నిఖిల్… సంచాలక్‌గా ప్రేరణ పక్షపాతం… ఓట్ అప్పీల్ టాస్క్ పూర్తి


 Nikhil Vote Appeal: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారంలో ఓట్ అప్పీల్ టాస్క్ ముగిసింది. ఈ క్రమంలో ప్రేరణ, నబిల్, విష్ణు ప్రియలు ఓట్ అప్పీల్ చేశారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో గోల్డెన్ టికెట్ అందుకున్న గౌతమ్, ప్రేరణ, నిఖిల్‌లకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. చివరి ఓట్ అప్పీల్ కోసం టాస్కులు పెట్టాడు. ఈ క్రమంలో మొదటి టాస్కులో భాగంగా..  కేక్ కటింగ్ పెట్టాడు. ముగ్గురు ఒకరి తరువాత ఒకరు కేక్ కట్ చేయాల్సి ఉంటుంది. అందులో 8 నంబర్ పెట్టి ఉంటుంది. ఎవరు కట్ చేసే టైంలో ఆ 8 పడిపోతుందో ఆ కంటెస్టెంట్ అవుట్ అని చెప్పాడు.

ఈ క్రమంలో రోహిణి ఈ టాస్కులో అవుట్ అవుతుంది. ఆ తరువాత రెండో ఛాలెంజ్‌లో రంగు పడుద్ది అంటూ నిఖిల్, గౌతమ్ పోటాపోటీగా ఆడారు. కొట్లాడుకున్నారు. నిఖిల్ నోరు జారాడు. గౌతమ్, నిఖిల్ కొట్టుకుంటూనే ఆడారు. అలా మూడు రౌండ్లకు ప్రేరణ సరైన నిర్ణయాన్ని ఇవ్వలేదనిపిస్తుంది. నిఖిల్ నోరు జారినా ప్రేరణ మాత్రం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. పైగా గౌతమ్ మీద తన ప్రతాపాన్ని చూపించింది ప్రేరణ. ఇక సంచాలక్ మీద కూడా గౌతమ్ ఫైర్ అయ్యాడు. బే అని అంటున్నాడు.. మీరేం చేస్తున్నారు.. తప్పు అని చెప్పరా? అంటూ ఇంటి సభ్యుల్ని కూడా నిలదీశాడు గౌతమ్.

Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 96 రివ్యూ: నేను నచ్చితే ఓట్లు వేసి గెలిపించిండి… వేడుకున్న విష్ణుప్రియ, – సంచాలక్‌గా రోహిణి గందరగోళం

మొదటి రౌండ్‌కి నిఖిల్ విన్నర్ అన్నట్టుగా చెప్పింది. ఆ తరువాత గౌతమ్ నిలదీశాడు. దీంతో టై చేయాలని అనుకుంది. కానీ అలా చేయొద్దని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ విన్నర్ అని చెప్పింది. రెండో రౌండ్‌కి నిఖిల్ విన్నర్ అని చెప్పింది. కానీ గౌతమ్ టీ షర్ట్ మీదే రంగు తక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఈ రెండో రౌండ్‌లోనే నిఖిల్ బే అంటూ గౌతమ్ మీద నోరు జారాడు. నువ్వు కావాలనే కొట్టావ్ అంటూ నిఖిల్ వాగ్వాదం పెట్టుకున్నాడు. కావాలని కొట్టలేదంటూ గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.

మూడో రౌండ్‌లో నిఖిల్ విన్ అయినట్టుగా చెప్పింది. అలా రెండు రౌండ్లలో నిఖిల్ విన్ అయి ఓటు అప్పీల్‌కు వెళ్లాడు. నా ఆట చూసి.. ఓటు వేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు.. నేను విన్నర్ అవ్వాల్ని అనుకుంటా.. నేను నా వరకు వంద శాతం కష్టపడతాను.. నన్ను గెలిపించండి.. మీకు రుణ పడి ఉంటాను.. తెలిసో తెలియక కొన్ని తప్పులు చేశా.. ఇక్కడి వరకు తీసుకొచ్చారు.. ఇప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉంటాను.. మీ ప్రేమ నాకెప్పుడూ కావాలి..  గెలవాలంటే మీ ఓట్లు కావాలి.. పిల్లలు తప్పులు చేస్తేక్షమించినట్టుగా నన్ను క్షమించండి.. నాకు ఓట్లు వేయండి.. గెలిపించండి.. అని నిఖిల్ ఆడియెన్స్‌ను రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆ తరువాత ఓంకార్ ఇంట్లోకి వచ్చి కంటెస్టెంట్లలో ఆటలు ఆడించి ఎంటర్టైన్ చేశాడు.

Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 95 రివ్యూ: ప్రేరణ వరెస్ట్ గేమ్… గెలిపించండని వేడుకున్న నబిల్… బిగ్ బాస్ లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments