Homeవినోదంబిగ్ బాస్ సీజన్ 7లో కొత్త ట్విస్టులు - 2.0 వర్షన్ అంటూ షాకిస్తున్న నాగార్జున

బిగ్ బాస్ సీజన్ 7లో కొత్త ట్విస్టులు – 2.0 వర్షన్ అంటూ షాకిస్తున్న నాగార్జున


బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో ట్విస్టుల పర్వం మొదలయినట్టు అనిపిస్తోంది. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని నాగార్జున ముందే ప్రకటించినా కూడా అసలు ఏ రకంగా ఉల్టా పుల్టా? అంతలా ఈ సీజన్‌లో ఏ మార్పులు వచ్చాయి? అని ప్రేక్షకులు విమర్శించారు. కానీ ఆదివారం ఎపిసోడ్‌తో ఆ ట్విస్టులు మొదలుకాబోతున్నాయని అర్థమవుతోంది. బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో బయటికొచ్చింది. ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు దాగి ఉన్నాయి. అవేంటి అని నాగార్జున పూర్తిస్థాయిలో రివీల్ చేయకపోయినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మాత్రం పక్కా అనే విషయం అర్థమవుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేస్తున్నారు..
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి అయిదు వారాలు అవుతుండగా.. ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఆదివారం మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోతారు. దీంతో కంటెస్టెంట్స్ సంఖ్య తొమ్మిదికి వచ్చేస్తుంది. ఈ విధంగా చూస్తే ఇంకొక నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయిపోతుంది. కానీ మామూలుగా బిగ్ బాస్ అనే రియాలిటీ షో 100 రోజులు సాగుతుంది. అలా సాగాలంటే బిగ్ బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావాలి. కేవలం ఒక కంటెస్టెంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కూడా లెక్క సరిపోదు. దీన్నిబట్టి చూస్తే.. ఈసారి బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముగ్గురు లేదా నలుగురు కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

కొత్తరకంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
ఇప్పటివరకు బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. కానీ ప్రతీ సీజన్‌లో కేవలం ఇద్దరు కంటెస్టెంట్స్‌ను మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా తీసుకొచ్చేవారు మేకర్స్. అది కూడా ఒకరి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి, మరొకరి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కాస్త గ్యాప్ ఉండేది. ఈసారి అలా కాదు.. ఒకేసారి నలుగురు కంటెస్టెంట్స్‌ను ఒకే ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపించనున్నారు. ఇక దీనికి బిగ్ బాస్ సీజన్ 7 2.0 అని పేరుపెట్టారు నాగార్జున. శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఆల్రెడీ మీరు ఊహించనిది ఏదో జరగబోతోంది అని హింట్ ఇచ్చారు నాగ్. అయితే ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆదివారం ఎపిసోడ్‌లో జరగనున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు.

సినీ తారల సందడి..
ఇక ఆదివారం ఎపిసోడ్‌లో కాస్త స్టార్ల సందడి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మామూలుగా చాలామంది సినీ సెలబ్రిటీలు వారు తెరకెక్కించిన సినిమాలను ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెడతారు. ఈసారి సిద్ధార్థ్.. తాను హీరోగా నటించిన ‘చిన్న’ అనే మూవీని ప్రమోట్ చేయడం కోసం బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సిద్ధును హౌజ్‌లోకి పంపించి కంటెస్టెంట్స్‌కు సర్‌ప్రైజ్ కూడా ఇవ్వనున్నారు నాగ్. సిద్ధార్థ్ మాత్రమే కాకుండా రవితేజ కూడా సండే ఎపిసోడ్‌లో సందడి చేయనున్నట్టు ప్రోమోలో చూపించారు. ఓవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో, మరోవైపు సినీ తారల సందడితో ఆదివారం ఎపిసోడ్ అంతా నిజంగా ఫన్‌డేలాగా మారనుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: బిగ్ బాస్ సీజన్ 7లో అయిదో ఎలిమినేషన్ – మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments