గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) విజయ దశమికి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలోకి సినిమా రావడానికి ముందు… ఆ చిత్ర బృందంతో ఆయన డిజిటల్ స్క్రీన్ మీద బాలకృష్ణ సందడి చేయనున్నారు. ఆహా ఓటీటీలో వినోదం పంచబోతున్నారు.
అన్‌స్టాపబుల్… ఈసారి లిమిటెడ్ ఎడిషన్!
నందమూరి బాలకృష్ణలో హీరో మాత్రమే కాదు… ఆయనలో సరదా మనిషి కూడా ఉన్నారని మన ప్రేక్షకులకు చూపించిన ఘనత ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో. ఇప్పటికి రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. దసరాకు మళ్ళీ ఈ షో సందడి మొదలు కానుంది. అయితే… ఇది సీజన్ 3 కాదు, అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్!
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ లిమిటెడ్ ఎడిషన్ (Unstoppable with NBK limited edition)లో మొదటి ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. అందులో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీలతో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సందడి చేశారు. ‘భగవంత్ కేసరి’ టీమ్ సందడి చేసిన ఎపిసోడ్ అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కానుంది.
Also Read : ‘కన్నప్ప’లో కన్నడ సూపర్ స్టార్ – సినిమా రేంజ్ పెంచేస్తున్న విష్ణు మంచు!
‘భగవంత్ కేసరి’ సినిమా యూనిట్ ఇప్పటి వరకు ప్రేక్షకులకు చూపించని వీడియో కంటెంట్ ‘అన్‌స్టాపబుల్’లో రివీల్ చేయనున్నారు. యాక్షన్ సీన్లు, ఆ సన్నివేశాల వెనుక సంగతులు పంచుకున్నారని తెలిసింది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ (Thaman)తో దర్శకుడు పాటలు, నేపథ్య సంగీతం ప్రత్యేకంగా చేయించడం వెనుక ఉన్న క్రియేటివిటీ గురించి అనిల్ రావిపూడి మాట్లాడారని సమాచారం.
Also Read : ఫ్లైట్‌లో హీరోయిన్‌ను వేధించిన పాసింజర్ – ఎయిర్ హోస్టెస్‌కి కంప్లైంట్ చేస్తే అలా చేస్తారా?
సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ!
ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందట. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఓ లెక్క… ఇప్పుడీ ‘భగవంత్ కేసరి’ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందట! కామెడీ కంటే కంటెంట్ ఎక్కువ హైలైట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.
‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial