Director Nag Ashwin Visits IMAX Theatre in USA: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ బాక్సాఫీసుల వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం 15 రోజుల్లోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్‌లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 17 మిలియన్ల డాలర్ల కలెక్షన్స్ చేసి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పటికే కొన్నిచోట్ల ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లు హౌజ్ ఫుల్‌గా ఉన్నాయి. ప్రస్తుతం బాక్సాఫీసు చెప్పుకొదగ్గ సినిమాలు లేకపోవడం.. కొత్త సినిమాలు కూడా ఏవీ లేవు. నిన్న విడుదలైన ‘భారతీయుడు 2’ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ లాంటి దిగ్గజ డైరెక్టర్ సినిమా అయినా ఈ మూవీ వచ్చిన టాక్ కల్కి 2898 ఏడీకి ఇంకా ప్లస్ అయ్యేలా ఉంది. పైగా ఈ నెలలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఇక రాబోయే రోజుల్లో కూడా బాక్సాఫీసు వ్దద ఈ మూవీ జోరే కనిపించనుంది.
ఈ క్రమంలో ఓ ఐమాక్స్ థియేటర్ యాజమాన్యం ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఆడియన్స్‌కి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకటి టికెట్ కొంటే మరోక టికెట్ ఉచితం అంటూ వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ నుంచి ఓ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఆఫర్ అందరికి కాదు. కేవలం ఫ్యామిలీ అండ్ ఫీమెల్ ఆడియన్స్‌కి మాత్రమే అంటూ కండిషన్ అప్లై చేశారు. అదీ కూడా బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ థియేటర్‌లో మాత్రమే. మరో ముఖ్య గమనిక ఏంటంటే.. ఇది ఇండియాలో కాదు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ టీసీఎల్ చైనీస్ థియేటర్లో (TCL Chiese Theatre) మాత్రమే.
Experience the EPIC MAHA BLOCKBUSTER #Kalki2898AD with our Director @nagashwin7 at @ChineseTheatres Today, July 13th 💥💥
🎟️- https://t.co/k0rLvklyXi#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh… pic.twitter.com/hmLKLHaHZF
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 13, 2024
ఈ ఆఫర్ ఆ ఒక్క థియేటర్లోనే ఎందుకంటే
కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా ఓవర్సీస్ మంచి బజ్ రాబట్టింది. దీంతో అక్కడ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ రోజు (జూలై 13) లాస్ ఎంజెల్స్‌లోని టీసీఎస్ చైనీస్ థియేటర్‌ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటారాక్ట్ అయ్యేందుకు ఫ్యామిలీ, ఫీమేల్ ఆడియన్స్‌నిక ఐమాక్స్ టీసీఎల్ చైనీస్ థియేటర్ యాజమాన్యం ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి వైజయంతీ మూవీస్ ఎక్స్ పోస్ట్‌లో ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఆఫర్ పొందడానికి ఆడియన్స్ ఏం చేయాలో కూడా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ ఆఫర్ చూసి అన్ని థియేటర్లోనూ ఈ ఆఫర్ ప్రకటిస్తే బాగుంటుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రస్తుతం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేకపోవడంతో ఆడియన్స్ మళ్లీ మళ్లీ సినిమాను థియేటర్లో చూపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కల్కి 2898 ఏడీ టికెట్ల రేట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని జంకేలా చేస్తుంది. అలాంటి వారంత మూవీ టికెట్ రేట్స్ తగ్గిస్తే థియేటర్‌కి వెళ్లి మూవీ చూద్దామని ఎదురుచూస్తున్నారు. కానీ, మూవీ విడుదలై రెండు వారాలు పూర్తయిన ఇంకా టికెట్ల రేట్ల ధరలు తగ్గింపుపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
మరిన్ని చూడండి