Bigg Boss 7 Evection Free Pass Promo : బిగ్‌బాస్ సీజన్ 7లో నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తానికి రతిక ప్రభావం యావర్‌పై బాగానే పడింది. దీంతో అమర్ చెప్పే మాటను కూడా యావర్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమర్ మాత్రం ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతున్నాడు. ఇదే కంటిన్యూ అయితే యావర్ తన ఇమేజ్ మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు అర్జున్ కూడా తన స్ట్రాటజీలు ప్రారంభించాడు. శివాజీని ఇండైరక్ట్‌గా టార్గెట్ చేశాడు. నామినేషన్ల తర్వాత పర్ఫార్మెన్స్ రాంకింగ్ గేమ్‌ను బిగ్‌బాస్ కంటెస్టెంట్ల (Bigg Boss Contenstents Telugu)కు ఇచ్చాడు.
పదివారాల మైలురాయి..
బిగ్‌బాస్ 7వ సీజన్ 73వ రోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ బిగ్‌బాస్ ఇంట్లో పదివారాల మైలురాయిని దాటి విన్నర్ అయ్యేందుకు మీ పదిమంది మాత్రమే మిగిలారు. ప్రతి ఒక్కరి ఓవరాల్ పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని మీలో మీరు చర్చించి.. ఒకటి నుంచి పది వరకు ర్యాంకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. దీంతో మొదటి స్థానం దగ్గరికి శివాజీ, గౌతమ్, అర్జున్, యావర్ వెళ్లి నిల్చోగా.. రెండో స్థానంలో ప్రియాంక (Bigg Boss Priyanka), ప్రశాంత్ (Pallavi Prashanth) నించొన్నారు. మూడో ప్లేస్‌లో శోభా నించున్నట్లు ప్రోమోలో చూపించారు.
రతిక టాప్ 5 అట
నేను 5 అనుకుంటున్నా. టాప్ 5లో నేనొక నెంబర్‌గా ఉండాలనుకుంటున్నా అని రతిక (Bigg Boss Rathika) తెలిపింది. అమర్, అశ్విని నాల్గొవ స్థానంలో నిల్చొన్నారు. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ మాత్రం 50, 60 పర్సెంట్ ఇచ్చావంటూ రతికకు తెలిపాడు. ఫోర్ వీక్స్ పర్ఫార్మన్స్ చూసుకుంటే నువ్వు 10 ప్లేస్‌కి డిజర్వింగ్ అని రతికను ఉద్దేశించి అర్జున్ వెల్లడించాడు. తనని డిఫెండ్ చేసుకుంటూ.. 10 ప్లేస్ అయితే నేను కాదు అన్నా అంటూ శివాజీకి తెలిపింది రతిక. కానీ హౌజ్ నిర్ణయం ఇదే అంటూ.. శివాజీ (Shivaji) చెప్పగా.. పదో ప్లేస్‌కి వెళ్లిపోయింది రతిక.
ఫస్ట్ ప్లేస్ ఎప్పటికైనా నాదే..
అమర్ మాట్లాడుతూ నాకైతే.. 1వ స్థానంలో ఉండాలని ఉంది. అంటుండగా గౌతమ్ (Doctor Gowtham) కలుగజేసుకుని లాస్ట్ వీక్స్ చూసిన దానిబట్టి 6 అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో 6వ ప్లేస్‌కి వెళ్లిన అమర్.. అది నాది అని నేను మరి మరి చెప్తున్నాను. అది నాదే అన్నాడు. నీ ఓన్‌గా నువ్వు స్టాండ్ తీసుకోవడం కంటే పక్క వాళ్ల విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని నాకు అనిపిస్తుందని రతిక తెలిపింది. నువ్వు 100 శాతం మార్క్ క్రియేట్ చేసుకుంది తను అని శివాజీ తెలిపారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తావనే నమ్మకం నాకు ఉంది. నీకు ఉంది. మూసుకుని అక్కడికెళ్లి నిల్చోమంటూ అమర్ (Amardeep) ప్రియాంకకు చెప్పాడు.
గోడ మీద పిల్లి నువ్వు
ఆరవ పొజీషన్లో నేను ఉండాలనుకున్నాను. అది వెళ్లిపోయందని రతిక చెప్పగా.. అర్జున్ (Bigg Boss Arjun) గోడమీద పిల్లిలాగా ఆన్సర్లు చెప్పకంటూ కసురుకున్నాడు. నీకర్థమవుతుందా? అంటూ రతిక అర్జున్‌ని ప్రశ్నించగా.. నాకు అర్థమవుతుంది అంటూ అర్జున్ బదులిచ్చాడు. తర్వాత ఒక్కదానివే నువ్వు ఏమి చేయలేదని శోభతో చెప్పాడు అర్జున్. నా ఎఫర్ట్స్ నీకు ఎక్కడా కనిపించలేదా అంటూ శోభా(Shoba Shetty) అర్జున్‌ని ప్రశ్నించింది. దీంతో శోభా తెగ ఫీలైపోయింది. ఏడవ ప్లేస్ ఏంట్రా? లక్ ఫేవర్ చేయడమేంటి అని బాధ పడింది. ప్రియాంక్, అమర్ కలిసి.. వాళ్లెవరు డిసైడ్ చేయడానికి అంటూ శోభను మోటివేట్ చేశారు. లోపలికెళ్లి ఎంత స్పైసీ చికెన్ తిని.. ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు రా అంటూ బాధపడుతుండగా ప్రోమో ముగిసింది.
Also Read : ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ ఉల్టా పుల్టా – ఆ ఐదుగురికే అవకాశం, పాపం గౌతమ్.. ఆ చిన్న తప్పుతో!