Homeవినోదంప్రకాశ్​రాజ్‌ను ఎంతగానో గౌరవిస్తా, కానీ ఆచీతూచీ మాట్లాడక తప్పదు- మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రకాశ్​రాజ్‌ను ఎంతగానో గౌరవిస్తా, కానీ ఆచీతూచీ మాట్లాడక తప్పదు- మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు


Manchu Vishnu Fires On Prakash Raj: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు టాలీవుడ్‌(Tollywood)లోనూ విమర్శలకు తావిచ్చింది. లడ్డూ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు మధ్య సోషల్ మీడియా వేదిక గా పెద్ద చర్చ జరగడం తెలిసిందే. ఈ వివాదంపై  మంచు విష్ణు(Manchu Vishnu) మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

కులమతాలకు అతీతం

జూబ్లీహిల్స్​లోని జీవీకే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో మా అసోసియేషన్ సభ్యులకు ఏర్పాటు చేసిన మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని హీరో మంచు విష్ణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ‘మా’ అసోసియేషన్​ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వస్తారని, అది కులమతాలకు అతీతమైన అంశమని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్) అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు పేర్కొన్నారు. లడ్డూ అంశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)​పై ఎక్స్ వేదికగా విలక్ణణ నటుడు ప్రకాశ్​రాజ్ చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు స్పందించారు. 

అంకుల్ అని పిలుస్తా
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ ను ఉద్దేశించి మంచు విష్ణు మాట్లాడుతూ .. ఆయన  చేసిన  పోస్ట్ పెట్టడం తన వ్యక్తిగత అభిప్రాయం.. అందులో ఎటువంటి కాంట్రవర్సీ లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ఎలా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారో నేను కూడా అలాగే  నా అభిప్రాయాన్ని చెప్పానని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.   ఆ గొడవకు మతం రంగు లేదని తాను గర్వంగా చెప్పగలనని, తాను మాట్లాడింది కరెక్టేనని అన్నాడు. నాన్న మోహన్ బాబు(Mohan babu) నటించిన ఎన్నో చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటించారు. నాకు చాలా ఏళ్లుగా ఆయన తెలుసునని వెల్లడించారు. తాను ప్రకాష్ రాజ్ ను అంకుల్ అని పిలుస్తానని, ఆయన అంటే నాకు గౌరవ, మర్యాదలు ఉన్నాయన్నారు. తాను తప్పుగా ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంచు విష్ణు జనాలకు స్పష్టం చేశారు. ఈ చిన్న ఇష్యూపై బయట మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని.. నాకు ఆ భయంగా ఉందని  అన్నారు.    

మా జీవితాలు అద్దాల మేడలాంటిది
సినిమా వాళ్ల జీవితం అద్దాల మేడ లాంటిదన్నారు. తిరుపతి లడ్డూ వంటి అత్యంత సున్నితమైన అంశాల్లో సినీ రంగంలోని వారు ఆచీతూచి మాట్లాడతారని, అలాగే మాట్లాడాలి కూడా అని విష్ణు సూచించారు. ఏదైనా విషయంపై తాను మాట్లాడితే కొంతమందికి నచ్చొచ్చు.. మరి కొంతమందికి నచ్చకపోవచ్చన్నారు. నచ్చని వాళ్లు తమను ఈజీగా టార్గెట్‌ చేస్తారని, అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా మాట్లాడతారని వివరించారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమోనని భయంగా ఉందన్నారు. అలానే శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ(Laddu)కు కమ్యూనల్ రంగు అంటించటం సరికాదని ప్రకాశ్​రాజ్ ట్వీట్​పై కామెంట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. 
ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.  ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయంపై మండిపడుతున్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ అపవిత్రం కావడానికి  ఏపీ మాజీ సీఎం జగన్(Ys jagan) కారణం అని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ తప్పు జరిగినందుకు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. మొన్న విజయవాడలో గుడి మెట్లు కూడా శుభ్రం చేశారు. ఇదిలా ఉంటే..  ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పవన్ ను ఉద్దేశిస్తూ.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇదని, విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని, మీరు ఎందుకు అనవసర భయాలు కల్పించి ఈ ఘటనను జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేస్తున్నారని పోస్ట్ చేశారు.   ఇక దీనిపై మంచు విష్ణు స్పందించడంలో నెట్టింట్లో  వివాదం మరింత ముదిరింది.  ఇంతా జరుగుతున్న ప్రకాశ్ రాజ్ మాత్రం అసలు తగ్గడం లేదు. జస్ట్ అస్కింగ్ అంటూ.. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కంటిన్యూగా పోస్టులు పెడుతూనే ఉన్నారు.  

Read Also :  ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు… లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments