Homeవినోదం'పొట్టేల్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... డబ్బా కొట్టడం కాదు, 'రంగస్థలం' టైపులో!

‘పొట్టేల్’కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ… డబ్బా కొట్టడం కాదు, ‘రంగస్థలం’ టైపులో!


Ananya Nagalla’s Pottel Movie Review In Telugu: పొట్టేల్… కొన్ని రోజులుగా ఈ సినిమా సౌండ్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ళ జంటగా నటించిన చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదీ ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, పాన్ ఇండియా వైడ్ సెన్సేషనల్ హిట్ అందుకున్న ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నుంచి! ఆయన ఈ సినిమా గురించి ఏం చెప్పారో తెలుసా?

సినిమా బావుంది… పాటలు నచ్చాయి!
తాను తొలుత ‘పొట్టేల్’ కథ విన్నానని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. దర్శకుడు సాహిత్ చిన్న కథ చేసుకున్నానని తనతో చెప్పాడని… అది విన్నాక అది చిన్న కథ కాదని, చాలా పెద్ద అని అర్థం అయ్యిందని ఆయన వివరించారు. హైదరాబాద్ సిటీలో సోమవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అందులో సినిమాకు బెస్ట్ రివ్యూ ఇచ్చారు.

‘పొట్టేల్’ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ”నేను సినిమా చూశా. చాలా బావుంది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా బాగా నచ్చింది. అజయ్ గారు అయితే సినిమా అంతా భయపెట్టించారు. యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ళ, నోయల్ సేన్, జీవా… మిగతా నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. నేను ఈ సినిమా చూశానని చెప్పడం లేదు. ఈ సినిమాను ఇంత బాగా తీస్తారని అసలు ఊహించలేదు. నాకు కథ చెప్పినప్పుడు బడ్జెట్ ఎక్కువ కనిపించింది. పెద్ద లొకేషన్లలో తీయాల్సిన సినిమా అనిపించింది. సాహిత్ మోత్కూరిని నమ్మిన నిర్మాతలు, అమెరికా నుంచి వచ్చిన నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ అధినేత సురేష్ కుమార్ సడిగేకి సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది” అని చెప్పారు.

Also Read: మాకూ హార్ట్ ఉంది… రెస్పెక్ట్ ఇవ్వండి – ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్?

‘రంగస్థలం’ చూశా… మళ్ళీ ‘పొట్టేల్’
తాను సినిమా చూశానని డబ్బా కొట్టడం లేదని, నిజంగా సినిమా బావుందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ… ”ప్రేక్షకులు అందరికీ ‘పొట్టేల్’ సినిమా నచ్చుతుంది. న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ బావుంది. యువ దర్శకులు ఈ తరహాలో పల్లెటూళ్లకు వెళ్లి సినిమా చేయడం ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అప్పట్లో ‘రంగస్థలం’ చూశా. తర్వాత ఈ సినిమా చూశా. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 25న అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి” అని అన్నారు.

Also Read‘కంగువా’ ఫస్ట్ హాఫ్​పై ప్రొడ్యూసర్ క్రేజీ కామెంట్స్, ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా?


ప్రీమియర్ షోలు వేయడానికి టీమ్ రెడీ!
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమాలో నటుడు అజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన రోల్ హైలైట్ అవుతుందని సమాచారం. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా ‘పొట్టేల్’ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ పతాకంపై సురేష్ కుమార్ సడిగే సంయుక్తంగా నిర్మించారు. విడుదల తేదీ కంటే ముందు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments