Homeవినోదంపొంగల్ విన్నర్ వెంకీ మామ... 'సంక్రాంతికి వస్తున్నాం'తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్

పొంగల్ విన్నర్ వెంకీ మామ… ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్


సంక్రాంతికి కుటుంబ ప్రేక్షకుల మొదటి ఛాయిస్ ఏదో అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. ఫ్యామిలీ ఆడియన్స్, మరి ముఖ్యంగా మహిళలలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఫాలోయింగ్ ఎంత బలంగా ఉందనేది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా (Sankranthiki Vasthunnam Movie) మరొకసారి చూపించింది. సంక్రాంతి 2025కు విడుదలైన సినిమాలలో వెంకీ మామ సినిమాకు మెజారిటీ జనాలు ఓటు వేశారు. మరి ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసిందో తెలుసా?

బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకీ మామ మాస్!
విక్టరీ వెంకటేష్, 100% స్ట్రైక్ రేట్ (విజయాలు)తో దూసుకు వెళ్తున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఇద్దరూ భారీ విజయం అందుకునే దిశగా దూసుకు వెళ్తున్నారు. జనవరి 14న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతికి అగ్ర నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ మరొక విజయం అందుకున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ తన కెరీర్ బెస్ట్ అండ్ హైయ్యస్ట్ ఓపెనింగ్ అందుకున్నారు. రూ. 45 కోట్ల క్రాస్ అంటే మామూలు విషయం కాదు. పెద్ద పండక్కి థియేటర్లలోకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటే ముందు వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు వచ్చాయి. ఆ రెండు భారీ విజయాలు సాధించాయి. ‘ఎఫ్ 3’ అయితే బాక్స్ ఆఫీస్ బరిలో ఆల్మోస్ట్ 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ గ్రాస్ క్రాస్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Read: డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్… మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?

కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన కామెడీ!
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయంలో అక్కడ తాంబూలం అనిల్ రావిపూడి రచనలోని వినోదానికి అందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని బుల్లి రాజు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ డైలాగ్స్, డెలివరీ ఆ డైలాగులకు ఆడియన్స్ అందరూ పడి పడి నవ్వుతున్నారు. అలాగే బీన్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా సినిమా విషయంలో కీలక పాత్ర పోషించింది. వెంకటేష్ తనదైన నటన మేనరిజంతో మరొకసారి ఫుల్ ఎంటర్టైన్ చేశారు.

Also Read‘గేమ్ చేంజర్’ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ… సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా… సీనియర్ నరేష్, యానిమల్ నటుడు ఉపేంద్ర లిమయే, డైలాగ్ కింగ్ సాయి కుమార్, ‘డీజే టిల్లు – టిల్లు స్క్వేర్’ సినిమాలలో తండ్రిగా నటించిన మురళీధర్ తదితరులు ఇతర కీలక పాత్రలో పోషించారు.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments