Homeవినోదం'పుష్ప 2'లో శ్రీవల్లి అదిరేటి స్టెప్పులేస్తే - ఈ పాట రష్మిక ఫ్యాన్స్ కోసం!

‘పుష్ప 2’లో శ్రీవల్లి అదిరేటి స్టెప్పులేస్తే – ఈ పాట రష్మిక ఫ్యాన్స్ కోసం!


Pushpa 2 Song feat Srivalli aka Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప 2: ది రూల్’లో ఫస్ట్ సాంగ్ / టైటిల్ సాంగ్ నచ్చింది. కామన్ ఆడియన్స్ నుంచి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఆ పాటలో శ్రీవల్లి లేదు. అదేనండీ… హీరోయిన్ రష్మికా మందన్న లేరు. ఆవిడ అభిమానుల కోసం రెండో పాటను విడుదల చేస్తున్నారు. 

పుష్పతో శ్రీవల్లి అదిరేటి స్టెప్పులేస్తే?
Pushpa 2 Second Single Announcement Video: ‘పుష్ప’ సినిమాలో ‘సామి సామి’ పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక కోసం ఆ పాటను మళ్ళీ మళ్ళీ చూసిన జనాలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్ ‘పుష్ప 2’లో కూడా రష్మిక మీద ప్రత్యేకంగా సాంగ్ డిజైన్ చేశారు. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల చేసేది గురువారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.

Also Readఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ – ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!

షూటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేశా!
‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తుంటే… అంచనాలు మరింత పెంచేశారు నేషనల్ క్రష్ రష్మిక. ఆ పాట షూటింగ్ చేసేటప్పుడు తాను బాగా ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులకూ ఆ సాంగ్ తప్పకుండా నచ్చుతుందని ఆవిడ పేర్కొన్నారు.

Also Read‘దేవర’కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క – బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలే!

‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్ ఉంటుందా? లేదా?
క్రియేటివ్ జీనియర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్. సుక్కు సినిమాల్లో డీఎస్పీ కంపోజ్ చేసే ఐటమ్ సాంగులకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘పుష్ప’లో సమంత చేసిన ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాట చార్ట్ బస్టర్. పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు ‘పుష్ప 2’లో ఐటెం సాంగ్ ఎలా ఉంటుంది? ఎవరు చేస్తారు? అని ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.


ఆగస్టు 15న ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ రిలీజ్!
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘పుష్ప 2’లో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విత్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments