తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన మలయాళ హీరోలలో ఉన్ని ముకుందన్ ఒకరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్ లాల్ కుమారుడిగా నటించారు. అనుష్క ‘భాగమతి’లో ఐఏఎస్ అధికారి చెంచల ప్రేమికుడిగా కనిపించారు. ఆయన హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘మార్కో’. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది.
ఉన్ని ముకుందన్ ‘మార్కో’ సినిమాకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాకు ఒక కామన్ కనెక్షన్ ఉంది. అదేమిటో తెలుసా?
ఆ రెండు ఫైట్స్… సేమ్ టు సేమ్…
హీరోలు ఇద్దరు అలా కొరికేశారేంటి?
‘పుష్ప ది రూల్’ సినిమా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అల్లు అర్జున్ అభిమానులకు మాత్రమే కాదు ఆడియన్స్ అందరికీ ఒక ‘హై’ ఇచ్చింది. అన్నయ్య కుమార్తెను కాపాడే సమయంలో హీరో చేసే ఫైట్ మామూలుగా లేదు అసలు. థియేటర్లలో జనాలకు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా మెడలో కపాలం పడిన తర్వాత బన్నీని చూస్తే ప్రాణాలు తీసే కాల యముడిగా కనిపించాడనే కామెంట్లు కూడా వినిపించాయి. ఆ ఫైట్ చూస్తే… అందులో హీరో రెండు చేతులు కాళ్లు కట్టేస్తారు. అయినా సరే గాల్లో ఎగురుతూ వెళ్లి రౌడీ మూకల పీకలు కొరుకుతాడు.
‘మార్కో’ విషయానికి వస్తే… ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ ఒకటి మన తెలుగు ప్రేక్షకులకు ‘పుష్ప ది రూల్’ క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్‌ను గుర్తు చేస్తుంది. ‘పుష్ప 2’ను రూరల్ యాక్షన్ సినిమాగా తీస్తే… ‘మార్కో’ను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టు తీశారు. ఈ రెండు సినిమాల బ్యాక్ డ్రాప్స్ వేరు. అయితే, ‘మార్కో’ ఇంటర్వెల్ ఫైట్‌లో కూడా హీరో చేతులు రెండు వెనక్కి కట్టేస్తారు. అప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్లి విలన్ గ్యాంగ్ లో ఒకరి చెవిని కొరికేస్తారు. అక్కడ ప్రేక్షకులకు వచ్చే ‘హై’ మాత్రమే సేమ్ టు సేమ్ ‘పుష్ప 2’ ఇచ్చిన ‘హై’.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న థియేటర్లు
‘మార్కో’ చిత్రాన్ని క్యూబ్ ఎంటర్టైన్మెంట్ పథకం మీద షరీఫ్ మహమ్మద్ ప్రొడ్యూస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మలయాళ, హిందీ వెర్షన్స్ విడుదల చేశారు. ఏపీ, తెలంగాణలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘మార్కో’ హిందీ వెర్షన్‌కు వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని ‘జినీవర్స్’ అధినేత బల్వంత్ సింగ్ మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: టాలీవుడ్ మీద ‘పుష్ప 2’ ఎఫెక్ట్… ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ – టికెట్ రేట్లూ పెరగవ్
‘జినీవర్స్’ అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ… ”తెలుగు చిత్రసీమ నుంచి వచ్చిన ‘బాహుబలి’, తాజా ‘పుష్ప 2’ – అలాగే కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన ‘కాంతార’, ‘కేజిఎఫ్’ గురించి దేశవ్యాప్తంగా ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో… అదే విధంగా మలయాళ చిత్రసీమ నుంచి వచ్చిన తాజా సినిమా ‘మార్కో’ గురించి కూడా మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ లభించడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ‘మార్కో’ హిందీ వర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే మంగళవారం నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం. తెలుగు ప్రేక్షకులకు ఉన్ని ముకుందన్ తెలుసు కనుక థియేటర్లకు జనాలు ఎక్కువ మంది వస్తున్నారు” అని అన్నారు.
Also Read: సలార్ డిజప్పాయింట్ చేసింది… ‘సలార్ 2’లో నేనేంటో చూపిస్తా – ప్రశాంత్ నీల్
మరిన్ని చూడండి