Homeవినోదంపనీ పాటా లేని పకోడీ గాళ్ళు... మిస్టర్ హరీష్ శంకర్ సెటైర్ ఎవరి మీద?

పనీ పాటా లేని పకోడీ గాళ్ళు… మిస్టర్ హరీష్ శంకర్ సెటైర్ ఎవరి మీద?


Harish Shankar targets gossip makers in Mr Bachchan trailer?: హరీష్ శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, తెలుగు భాష మీద పట్టున్న మంచి రచయిత కూడా! ఆయన రాసే డైలాగుల్లో పంచ్ ఉంటుంది, ఒక ఫైర్ ఉంటుంది! అంతకు మించి మరో స్పెషాలిటీ ఉంది. అది ఏమిటంటే… రియల్ లైఫ్ రిప్రజెంట్ చేసేలా రీల్ లైఫ్ (సినిమాల్లో)లో డైలాగ్స్ రాయడం! ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ చూస్తే… గాసిప్ రాయుళ్ల మీద గట్టిగా పంచ్ వేశారని అనుకోవాలి.

పనీ పాటా లేని పకోడీ గాళ్ళు!
Mr Bachchan Trailer Review: ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ చూస్తే… రొమాన్స్, యాక్షన్, మాస్ మూమెంట్స్ – అన్నీ ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా టైటిల్ కార్డు పడే ముందు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) చెప్పే డైలాగ్!

‘ఓసి పిచ్చి బుజ్జమ్మ… చాలా మంది భయపడేది సమస్యలకు కాదు! పుకార్లకు, రూమర్లకు! పనీ పాటా లేని చాలా మంది పకోడీ గాళ్ళు ఇదే పని మీద ఉంటారు’ – ఫోనులో రవితేజ చెప్పే మాట ఇది. ఇటీవల కాలంలో దర్శకుడు హరీష్ శంకర్ సినిమాల మీద వచ్చినన్ని పుకార్లు, రూమర్లు ఇతర సినిమాల మీద రాలేదని చెప్పాలి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిందని, ఆగస్టు 15కు ‘మిస్టర్ బచ్చన్’ విడుదల చేస్తూ గురు ద్రోహం చేస్తున్నాడని బోలెడు పుకార్లు. అటువంటి గాసిప్ రాయుళ్లకు ఈ డైలాగ్ హరీష్ శంకర్ గట్టిగా ఇచ్చాడని అనుకోవాలి.  

‘మిస్టర్ బచ్చన్’ టీజర్ చూస్తే ఇటువంటి డైలాగ్ ఒక్కటి ఉంటుంది… ”సక్సెస్, ఫెయిల్యూర్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి! వస్తుంటాయ్, పోతుంటాయ్… యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది! అది పోయే దాకా మనతోనే ఉంటుంది” అని రవితేజ చెబుతారు. హరీష్ శంకర్‌కు యాటిట్యూడ్ ఎక్కువ అని, రవితేజకు వరుస ఫ్లాపులు అని విమర్శలు చేసినోళ్లు ఉన్నారు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన యాటిట్యూడ్ కంటిన్యూ అవుతుందని హరీష్ చెప్పారని అనుకోవాలి.

Also Readతమన్నా డబుల్ బొనాంజా – బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?

‘గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది’ అని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేత ఓ డైలాగ్ చెప్పించారు హరీష్ శంకర్. అది సినిమా కంటే రాజకీయ జీవితాన్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేసింది. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, ఏపీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించడానికి ముందు జనసేనాని మీద ప్రత్యర్థులు విమర్శలతో విరుచుకుపడ్డారు. పగిలే కొద్దీ పదును ఎక్కుద్దని చెప్పే మాట అభిమానులకు కనెక్ట్ అయ్యింది. వైరల్ అయ్యింది. ‘గబ్బర్ సింగ్’లో ‘పాట వచ్చి పదేళ్లు అయ్యింది, అయినా పవర్ తగ్గలేదు’ అనేది కూడా పవన్ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పేది.

‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ విడుదల అయ్యాక… గాసిప్ రాయుళ్లకు హరీష్ శంకర్ గట్టిగా ఇచ్చారని అనుకోవాలి. దీని మీద నెటిజన్స్, సదరు గాసిప్స్ క్రియేట్ చేసే వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Readశివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా – ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments