Viswam OTT Platforms: మాచో స్టార్ గోపీచంద్, స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘విశ్వం’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
నిన్న అమెజాన్, నేడు ఆహాలో ‘విశ్వం’ స్ట్రీమింగ్
గోపీచంద్ సినిమా రెండు రోజుల క్రితం దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సైలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఓటీటీలో ఆడియెన్స్ నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. గతంలో సుధీర్ బాబు హీరోగా నటించి ‘హరోం హర’ సినిమా సైతం రెండు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ‘విశ్వం’ కూడా రెండు ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆహా ఎంతకు తీసుకుంది అనే విషయంపై క్లారిటీ లేదు.
కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయిన ‘విశ్వం’
గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. కామెడీ రొటీన్ గా ఉండటంతో థియేటర్లలో ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ‘లౌక్యం’ సినిమా తర్వాత గోపీ చంద్ పలు సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. దీపావళి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. కమర్షియల్ గా ‘విశ్వం’ సక్సెస్ కాలేకపోయింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ ‘విశ్వం’ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. వేను దొనేపూడి, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, కొండల్ జిన్నాలు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో గోపీచంద్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. థియేటర్లలో చూడని ప్రేక్షకులు అమెజాన్, లేదంటే ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి.
Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
మరిన్ని చూడండి