Homeవినోదంనాగ చైతన్యతో తమన్నా ప్రాంక్, చివర్లో ఊహించని ట్విస్ట్

నాగ చైతన్యతో తమన్నా ప్రాంక్, చివర్లో ఊహించని ట్విస్ట్


Dhootha Web Series: అక్కినేని హీరో నాగ చైతన్య బయట చాలా డీసెంట్ గా ఉంటారు. వివాదాలకు దూరంగా కనిపిస్తారు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివిటీస్ ఉండవు. కానీ, ఆయన రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశారు. అయినా, అందులో పెద్దగా వీడియోలు ఏమీ పెట్టడం లేదు. తొలిసారి ఆయన ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ‘దూత’ అనే పేరుతో అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తోంది.

ఒకే సెట్ లో తమన్నా, నాగ చైతన్య

తాజాగా ‘దూత’ ప్రమోషన్ కోసం చైతన్య ముంబైకి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తమన్నాను కలిశారు. ఆ సమయంలోనే తమన్నా చైతన్య మీద ఓ ఫ్రాంక్ చేయాలనుకుంది. చై సెట్ లోకి వెళ్లగానే తమన్నా మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఇక్కడికి వచ్చావేంటి? అని తమన్నా అడిగింది. అమెజాన్ ప్రైమ్ వాళ్లు పిలిస్తే వచ్చానని చై చెప్పాడు. ఇది తన సెట్ అని తమన్నా తెలిపింది. కావాలంటే చూడండి అంటూ తన షూటింగ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి చూపించింది. నన్ను కూడా ఇక్కడికే రమ్మన్నారని చైతన్య తెలిపాడు. ఇంతకీ ఇక్కడ షూటింగ్ ఎవరితో తెలుసుకునేందుకు నాగ చైతన్య  ఫోన్ చేశాడు. అదే ఫోన్ లో తమన్నా ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఖర్చు తగ్గించుకునేందుకు ఓకే సెట్ లో రెండు షూటింగ్స్ పెట్టుకున్నారేమోనని ఇద్దరూ అనుకున్నారు.

తమన్నా ఫ్రాంక్,  చైతన్య ట్విస్ట్

నెమ్మదిగా నాగ చైతన్యను తమన్నా అందంగా ముస్తాబు చేసిన ఓ రూమ్ లోకి తీసుకెళ్లింది. ఇక్కడేదో చిన్న పిల్లల బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లుంది అని చై తెలిపాడు. వెంటనే అక్కడ బోర్డు మీద ఉన్న  క్లాత్ ను తొలగించింది. ఆ బోర్డు మీద ‘వెల్ కం టు అమెజాన్ ప్రైమ్ నాగ చైతన్య’ అని రాసి ఉంది. ఆ బోర్డు చూసి నాగ చైతన్య షాకయ్యాడు. తమన్నాకు థ్యాంక్స్ అంటూ, ఆమె కోసం తెచ్చిన ఓ కవర్ ఇచ్చాడు. ఆ కవర్ లో తమన్నా మిమ్మల్ని ప్రాంక్ చేయబోతోందని రాసి ఉంది. ఈ కవర్ చూసి తమన్నా నిజంగానే షాకైంది. నీకు ఇది ఎవరిచ్చారు? అని అడిగింది. ‘టు నో మోర్.. వాచ్ ‘దూత’ అని చెప్తారు నాగ చైతన్య. మొత్తంగా ‘దూత’ సిరీస్ కోసం తమన్నా ఫ్రాంక్, నాగ చైతన్య ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

డిసెంబర్ 1 నుంచి ‘దూత’ స్ట్రీమింగ్

ఇక ‘దూత’ వెబ్ సిరీస్ ను దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. మొత్తం 8 ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోంది. డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సిరీస్ ను సుమారు రూ. 40 కోట్లతో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. అటు చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్నారు. NC23 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

Read Also: త్రిషాపై కామెంట్స్ – నటుడు మన్సూర్ అలీపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్, పోలీసులకు కీలక ఆదేశాలు





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments