‘జబర్దస్త్’ షోతో పాపులర్ యాంకర్ గా మారిన అనసూయ… ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా దూసుకెళ్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చేసే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక ఇయర్ ఎండ్ వచ్చేసింది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్ తో కొత్త కొత్త టార్గెట్ లను రీచ్ కావాలని కోరుకుంటారు. అలాగే వెళ్లిపోతున్న ఈ ఏడాది ఎలాంటి పాఠాలు నేర్పించిందో కూడా గుర్తు పెట్టుకుంటారు. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ హడావిడి మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా అనసూయ ‘2024 నాకు నేర్పిన పాఠాలు’ అంటూ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అనసూయ పోస్ట్ వైరల్ అనసూయ
తాజాగా ‘2024 నాకు నేర్పిన జీవిత పాఠాలు’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో “మిమ్మల్ని మీరు మార్చుకునే మీ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. అలాగని అతిగా అంచనా వేయకండి. అందులోనూ మీ ప్రేమకున్న శక్తిని ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకంటే మీరు గులాబీలను ఎంత ప్రేమిస్తారో వాటికున్న ముళ్లను కూడా అంతే ప్రేమించగలుగుతారు. ఫలితంగా మీరు మరింత పవర్ ఫుల్ గా మారతారు” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది అనసూయ. ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషాలతో పాటే కష్టాలను కూడా సునాయాసంగా గట్టెక్కాలి అంటే మీ మీద మీకున్న ప్రేమతోనే సాధ్యమవుతుందని చెప్పింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read: అల్లు ఇంటిలో టాలీవుడ్… మరి మెగా ఫ్యామిలీ ఎక్కడ? ఇవాళ ఎవరూ రాలేదే?
10 నెలల తర్వాత ఓటిటిలోకి అనసూయ మూవీ…
ఇదిలా ఉండగా అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రజాకర్’ థియేటర్లలో రిలీజ్ అయిన 10 నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో అనసూయ, బాబి సింహ, వేదిక, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించగా, యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. మార్చ్ 15న థియేటర్లలో రిలీజ్ అయిన ‘రజాకార్’ మూవీ వివాదాన్ని రేకెత్తించింది. ఇక థియేటర్లలో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా… ఓటీటీ రిలీజ్ కు ఏకంగా 10 నెలలు పట్టింది. ఈ మూవీ ఓటిటి రైట్స్ ఆహా సొంతం చేసుకోగా, త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ‘రజాకర్’ మూవీ డిసెంబర్ 20న లేదంటే 26న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు అనసూయ తాజా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప 2’లో ద్రాక్షాయణి పాత్రలో మెరిసింది. ఇందులో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె అదరగొట్టింది. ఏకంగా పుష్ప రాజ్ అంతాన్ని కోరుకునే లేడి విలన్ గా ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలలో నటించింది అనసూయ.
Also Read: 50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు… సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్
మరిన్ని చూడండి