Bigg Boss Telugu 7 Promo : ఉల్టా పుల్టా అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 7లో నామినేషన్స్ కూడా క్రియేటివ్‌గా జరుగుతున్నాయి. సండే ఎపిసోడ్‌లో ఫ్రెండ్స్ అని కలిసిపోయిన కంటెస్టెంట్స్ సైతం సోమవారం నామినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ గొడవలు మొదలుపెట్టారు. ఇక ఈ నామినేషన్స్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది. తాము నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న చికెన్ ముక్కను సింహం నోట్లో పెడితే.. వారు నామినేట్ అయినట్టు అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్.. తమ నామినేషన్స్‌ను మొదలుపెట్టారు.
అమర్ వర్సెస్ యావర్..
‘‘ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా మీరు సింహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అసలే ఆకలితో ఆహారం కోసం బాగా ఎదురుచూస్తోంది. మీరు అనర్హులు అని భావించే ఇద్దరిని, వారి ఫోటో ఉన్న చికెన్ ముక్కను తీసుకొని సింహం నోట్లో వేసి దాని ఆకలి తీర్చాల్సి ఉంటుంది’’ అని ప్రోమో మొదలవ్వగానే బిగ్ బాస్ వివరించారు. ముందుగా వచ్చిన అమర్‌దీప్.. యావర్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం అర్జున్‌తో తలపడిన టాస్కులో యావర్ చేసిన తప్పులను గుర్తుచేశాడు అమర్. ‘‘నువ్వు కాలు కింద పెట్టావా అని అడిగితే.. లేదు లేదు నేను పెట్టలేదు అన్నావు. బాల్స్‌లో కూడా ఎక్కువసేపు నువ్వు బాల్స్‌ను పట్టుకున్నావు’’ అంటూ యావర్ చేసిన తప్పులను చెప్పుకొచ్చాడు. దానికి యావర్.. ‘‘నీ తప్పు అది నా తప్పు కాదు’’ అని డిఫెండ్ చేసుకోబోయాడు. ‘‘విజువల్ చూశాను కాబట్టి చెప్తున్నాను’’ అంటూ అమర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా యావర్ వినకపోవడంతో ‘‘సంచాలకుడిగా నేను ఫెయిల్ కదా.. నామినేట్ చేయ్. సంచాలకుడిగా నేను అర్జున్‌కు అన్యాయం చేశాను’’ అని రివర్స్ అయ్యాడు.
ప్రశాంత్‌తో రతిక వార్..
అమర్‌దీప్ తర్వాత అర్జున్ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో యావర్ చేసిన తప్పుల ఆధారంగానే తనను నామినేట్ చేశాడు. ‘‘చేయి బాల్ మీద ఉంది అన్నప్పుడు నీ ఆలోచన ఎక్కడ ఉంది అని అడుగుతున్నా’’ అని యావర్‌ను ప్రశ్నించాడు అర్జున్. ఆ తర్వాత శివాజీని నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. బాల్స్ టాస్క్‌లో యావర్ ఆడుతున్నప్పుడు శివాజీ అరిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అది డిస్టర్బ్ చేసినట్టు కాదా అని ప్రశ్నించాడు. రతిక వచ్చి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. ‘‘వాళ్లకి దెబ్బ తాకితే నీకు రక్తం వచ్చినట్టుంది’’ అంటూ రతిక చెప్పిన కారణాన్ని తీసిపారేశాడు ప్రశాంత్. ‘‘అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు’’ అని రతిక వార్నింగ్ ఇచ్చింది. ప్రశాంత్‌తో పాటు అమర్‌ను కూడా నామినేట్ చేసింది రతిక. దానికి సమాధానంగా ‘‘నా పద్ధతి అదే. నా ఆట అదే. నా వేట అదే’’ అని అమర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
శివాజీపై ప్రశాంత్ సీరియస్..
ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకుడిగా పల్లవి ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్తూ గౌతమ్ తనను నామినేట్ చేశాడు. ‘‘ఆ బాల్ పడిపోతుంటే కూడా ఒకసారి యావర్ చేయితో ఆపాడు’’ అని ప్రశాంత్‌ను నామినేట్ చేస్తుండగా గౌతమ్ చెప్పాడు. గౌతమ్ మాటను తప్పుబట్టిన యావర్.. సమర్థించుకోవడానికి ముందుకు వచ్చాడు. అలా చేయలేదు అని వాదించడం మొదలుపెట్టాడు. శివాజీ కూడా యావర్‌ను సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు. దీంతో ప్రశాంత్ సీరియస్ అయ్యాడు. ‘‘ఏంటన్నా నేను మాట్లాడుతుంటే మధ్యలో మొత్తం మీరే వస్తున్నారు. నాదా మీదా నాకు అర్థం కావట్లేదు’’ అని శివాజీని ఉద్దేశించి అన్నాడు. మధ్యలో గౌతమ్ జోక్యం చేసుకొని ‘‘అన్నా వినరాదే’’ అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘నన్ను నామినేట్ చేస్తున్నావా, వాళ్లని నామినేట్ చేస్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. వీడిని చేయి మావాడే. సైలెంట్‌గా ఊరుకుంటాడు’’ అంటూ సింహాన్ని చూపిస్తూ కామెడీ చేశాడు ప్రశాంత్.
Also Read: ఈవారం నో ఎలిమినేషన్ – కానీ వచ్చేవారం మరిన్ని ట్విస్టులతో!