Homeవినోదంధనుష్, ఐశ్వర్య కలిసి ఉండేది లేదట, విడాకులే కావాలట.. విడిపోవడానికే కోర్టుకు వెళ్లారు

ధనుష్, ఐశ్వర్య కలిసి ఉండేది లేదట, విడాకులే కావాలట.. విడిపోవడానికే కోర్టుకు వెళ్లారు


Dhanush – Aishwarya Divorce Updates : తమ పెళ్లి జీవితానికి చెక్ పెట్టి.. విడిపోవాలని అనుకుంటున్నారు ధనుష్, ఐశ్వర్య. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ జంట బ్రేక్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించగానే.. అందరూ షాక్​కి గురయ్యారు. ఇటీవల వారు కలిసిపోతున్నారు.. విడాకులు ఏమి లేవు అనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ తాజాగా జరిగిన విడాకుల కేసు విచారణకు ధనుష్, ఐశ్వర్య హాజరై.. తాము విడిపోవాలనుకుంటున్నట్లు న్యాయస్థానంలో తెలిపారు. 

చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట ధనుష్, ఐశ్వర్య  హారయ్యారు. మళ్లీ కలిసిపోయారనే వార్తలకు చెక్ పెడుతూ.. లేదు మేము విడిపోవాలనుకుంటున్నామని.. తమ తమ రీజన్స్ తెలిపారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. ఫ్రెండ్స్​గా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 18 ఏళ్లు వీరు ఐడియల్ కపుల్​గా కనిపించారు. కానీ సడెన్​గా విడిపోతున్నట్లు ఇన్​స్టాలో పోస్ట్​ ద్వారా తెలిపారు. 

ఈ నవంబర్ 18తో వీరికి పెళ్లి జరిగి 20 సంవత్సరాలు. కానీ ఎంతకాలం కలిసి ఉండి ఏమి లాభం. విడిపోవాలి అనుకున్నాక.. మళ్లీ ఏమి జరిగినా కలవడమంటూ ఉండదనే రేంజ్​లో ఇద్దరూ విడిపోతామంటూ న్యాయస్థానానికి తెలిపారు. ఈ రిలేషన్​లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా.. మ్యూచువల్ అండర్​స్టాండిగ్​తోనే విడిపోతున్నట్లు గతంలోనే పోస్ట్​ ద్వారా తెలిపారు. తమ తమ కెరీర్​లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు పోస్ట్​ ద్వారా వెల్లడించారు. 

గతంలో న్యాయస్థానంలో జరిగిన విచారణకు వీరిద్దరూ రాలేదు. దీంతో వారు టైమ్ తీసుకుంటున్నారు. మళ్లీ కలుస్తారనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. రజినీకాంత్ వీరిద్దర్ని కలిపేందుకు ట్రై చేస్తున్నారని కూడా కోలివుడ్లో వినిపించాయి. కానీ తాజాగా జరిగిన విచారణకు ఇద్దరూ హాజరయ్యారు. కలిసి ఉండాలని లేదని తెలిపి.. దానికి తగిన రీజన్స్ చూపిస్తూ.. విడాకులు కోరారు. వారి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. వచ్చేవారం జరిగే చివరి విచారణతో వీరికి విడాకులు మంజూరు అవుతాయి.

సెలబ్రెటీల్లో పెరుగుతున్న విడాకులు.. 

అప్పటివరకు ఐడియల్​గా కనిపించిన కపుల్ అంతా సడెన్​గా పోస్ట్​లు పెట్టి.. మేము విడిపోతున్నాము.. మమ్మల్ని అర్థం చేసుకోండి అంటున్నారు. ఫ్రెండ్స్​గా ఉంటూ.. ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకుని.. సడెన్​గా విడిపోతున్నామంటున్నారు. టాలీవుడ్​లో క్యూట్​గా, లవ్లీగా కనిపించిన చైతన్య, సమంత కూడా ఇలానే విడిపోయారు. ధనుష్ – ఐశ్వర్య పరిస్థితి కూడా దాదాపు అంతే. ఏఆర్ రెహమాన్ కూడా తాజాగా తన పెళ్లిజీవితాన్ని ఎండ్ చేస్తున్నామంటూ రాసుకొచ్చారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్​ కూడా విడిపోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.  

Also Read : Gen Zలకు సోకుతున్న డేంజర్ డిసీజ్‌- ట్రెండ్‌గా మారుతున్న డివోర్స్ ఇన్​ ద ఎయిర్

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments