Homeవినోదందిగజారి ప్రవర్తించకండి- గేమ్ ఛేంజర్ ట్రోలర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆగ్రహం

దిగజారి ప్రవర్తించకండి- గేమ్ ఛేంజర్ ట్రోలర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆగ్రహం


Thaman Responds To Trolls: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగున్న ఎస్ థమన్, నెటిజన్ల నుంచి చాలాసార్లు ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ పాట విడుదలైనా… తరచుగా నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఫలానా సినిమా నుంచి ట్యూన్స్ ఎత్తుకొచ్చారంటూ ఒరిజినల్ ట్యూన్స్ పట్టుకొచ్చి మరీ రచ్చ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తమన్ సోషల్ మీడియా ట్రోలింగ్స్ గురించి స్పందించారు. సినీ అభిమానులతో పాటు, నెటిజన్లను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.    

దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి- తమన్

సినిమా పరిశ్రమ కోసం కష్టపడి పని చేస్తున్న వారి పట్ల అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని నెటిజన్లకు తమన్ రిక్వెస్ట్ చేశారు. “డియర్ బ్రదర్స్… అంతా బాగానే ఉంది. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఓ టెక్నీషియన్ గా నేను అర్థం చేసుకున్నాను. మీ ప్రోత్సాహం, ప్రేమ మాకు ఎప్పుడూ ఉండాలి. మేం ఏ సినిమా చేసినా మీ కోసమే. మా సినిమాకు మీరు బ్లడ్ లాంటి వాళ్లు. కానీ కొంత మంది దిగజారుడు కామెంట్స్ చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ ను కించపరిచేలా హ్యాష్ ట్యాగ్స్ కొనసాగిస్తున్నారు. దయ చేసి అసభ్యకర కామెంట్స్ చేయకండి. సినిమా పరిశ్రమ కోసం ఫిల్మ్ మేకర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. వారికి సపోర్టుగా ఉండి.. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుదాం” అని పిలుపునిచ్చారు.    

 తమన్ రియాక్షన్ కు కారణం ఇదే!

చాలా మంది సినీ అభిమానులు తమ హీరో మూవీ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. రకరకాల కారణాలతో దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వలేకపోతాయి. దీంతో సినీ అభిమానులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా తమ కోపాన్ని వెల్లగక్కుతారు. కొంతమంది నెటిజన్లు హద్దు మీరి కామెంట్స్ పెడుతున్నారు. అసభ్యకరంగా, మేకర్స్ ను కించపరిచేలా హ్యాష్ ట్యాగ్స్ కొనసాగిస్తుంటారు. వెంటనే మూవీ అప్ డేట్స్ ఇవ్వాలంటూ ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ విషయంలోనూ ఇదే తరహా ట్రోలింగ్ కొనసాగుతోంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను చాలా నెలలుగా తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో విడుదల అవుతుందని చెప్పినా, పలు మార్లు వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సంస్థతో పాటు దర్శకుడిపైనా అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్ స్పందించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Read Also: బూతు బొమ్మలు కాదు.. బాలయ్య సినిమా పడాల్సిందే – ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ‘బాలు గాని టాకీస్’ ట్రైలర్

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments