Homeవినోదందసరాకు థియేటర్లలో 'అఖండ 2' - భారీ యాక్షన్ సీక్వెన్సుతో షూట్ స్టార్ట్ చేసిన బాలయ్య, బోయపాటి

దసరాకు థియేటర్లలో ‘అఖండ 2’ – భారీ యాక్షన్ సీక్వెన్సుతో షూట్ స్టార్ట్ చేసిన బాలయ్య, బోయపాటి


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)… బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ బాక్సాఫీస్ బరిలో పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వాళ్ళిద్దరూ మూడు సినిమాలు చేశారు. ఆ మూడు భారీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాలయ్య, బోయపాటి కలయికలో రూపొందుతున్న తాజా సినిమా ‘అఖండ 2 తాండవం’ (Akhanda 2 Thandavam). ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

దసరాకు థియేటర్లలో అఖండ తాండవం
‘అఖండ 2 తాండవం’ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రోజు సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేశారు. విజయదశమి సందర్భంగా… వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ తాండవం చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.‌ ఈ సందర్భంగా ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. దానికి తమన్ అందించిన నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

బాలకృష్ణ పాల్గొనగా భారీ యాక్షన్ సీక్వెన్స్!
ఇవాళ మొదలైన ‘అఖండ 2 తాండవం’ చిత్రీకరణలో నందమూరి బాలకృష్ణ జాయిన్ అయ్యారు. దర్శకుడు బోయపాటి శ్రీను తన స్టైల్ ఫాలో అవుతూ భారీ యాక్షన్ సీక్వెన్సుతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. టాప్ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య మీద భారీ ఫైట్ తీస్తున్నారు. అది పూర్తి అయిన తర్వాత కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించనున్నారని చిత్ర బృందం పేర్కొంది.

Also Read: ‘జాతి రత్నాలు’ దర్శకుడితో విశ్వక్ సేన్… నాగ్ అశ్విన్ క్లాప్‌తో మొదలైన మూవీ, షూటింగ్ ఎప్పుడంటే?

అటు బాలయ్య… ఇటు బోయపాటి…
ఇద్దరికీ ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా!
ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా కల్చర్ నడుస్తోంది. సౌత్ సినిమాలకు… మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాలకు నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ కనబడుతోంది. ‘అఖండ 2’ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించారు. అయితే… మన దగ్గర విడుదలైన తర్వాత డబ్బింగ్ ద్వారా నార్త్ ఇండియా జనాల ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ‘అఖండ 2 తాండవం’ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా తీస్తున్నారు. అటు బాలకృష్ణ, ఇటు బోయపాటి ఇద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రానికి సి రాంప్రసాద్, సంతోష్ డి డేటాకే ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా… తమ్మిరాజు ఎడిటింగ్ చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.

Also Readకేతికా శర్మకు తెలుగులో మరో సినిమా… ఆవిడతో పాటు ‘లవ్ టుడే’ ఇవానా కూడా – హీరో ఎవరంటే?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments