Homeవినోదందళపతి విజయ్ ఆఖరి సినిమా... వైభవంగా పూజతో షురూ, రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే?

దళపతి విజయ్ ఆఖరి సినిమా… వైభవంగా పూజతో షురూ, రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే?


దళపతి విజయ్ (Thalapathy Vijay) కొత్త సినిమా ఓపెనింగ్ శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో జరిగింది. ఇంతకు ముందు ఆయన సినిమా లాంచ్ జరగడం వేరు, ఇప్పుడు జరగడం వేరు. ఆయన ఆఖరి సినిమా కావడంతో దళపతి 69 ప్రారంభోత్సవానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే…

భారీగా తెరకెక్కిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
విజయ్ ఆఖరి చిత్రాన్ని నిర్మించే అవకాశం కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేవి నవ రాత్రుల్లో రెండో రోజున ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తన నటనతో, తనదైన హీరోయిజంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు విజయ్. తమిళనాడులో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ప్రేక్షకులలో సైతం విజయ్ ఫ్యాన్స్ సంఖ్య తక్కువ ఏమీ కాదు. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించడానికి కేవీఎల్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ రెడీ అయ్యారు.

విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే!
విజయ్ 69వ చిత్రం ఇది. అందుకని, దళపతి 69 (Thalapathy 69)ని వర్కింగ్ టైటిల్ కింద ఫిక్స్ చేశారు మీ సినిమాలో విజయ్ జంటగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) నటించనున్నారు. ‘బీస్ట్’ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తమిళంలో బుట్ట బొమ్మ ఖాతాలో మరో భారీ సినిమా అని చెప్పవచ్చు. సినిమా పూజా కార్యక్రమాల్లో ఈ విజయ్, పూజా హెగ్డే స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన… తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

కీలక పాత్రలో ‘ప్రేమలు’ ఫ్రేమ్ మమత… బాబీ కూడా!
దళపతి 69 చిత్రానికి హెచ్ వినోద్ దర్శకుడు. శనివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో ‘ప్రేమలు’ సినిమాతో కేరళలో పాటు తెలుగులోనూ భారీ విజయం అందుకున్న హీరోయిన్ మమతా బైజు కీలక పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read‘శ్వాగ్’ రివ్యూ: ‘రాజ రాజ చోర’ మేజిక్ రిపీట్ అయ్యిందా… శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?


దళపతి 69 విడుదల ఎప్పుడంటే?
Thalapathy 69 Release Date: తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వచ్చే ఏడాది అక్టోబర్‌ నెలలో విడుదల కానుంది. ‘దళపతి 69’ చిత్రానికి సంగీత దర్శకుడు: అనిరుద్‌, సినిమాటోగ్రాఫర్: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటర్: ప్రదీప్‌ ఇ రాఘవ్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ: అనల్‌ అరసు, ఆర్ట్ డైరక్టర్‌: సెల్వ కుమార్‌, కాస్ట్యూమ్స్: పల్లవి సింగ్‌.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments