Homeవినోదందగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్, కోర్టు ఆదేశాలతో కేసు నమోదు


హైదరాబాద్: దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత అంశంపై దగ్గుబాటి ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. దగ్గుబాటి ఫ్యామిలీలో సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని విచారించాలని నాంపల్లి 17వ కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..
దక్కన్ కిచెన్ హోటల్ విషయంపై నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంంది. తాను లీజుకు తీసుకున్న హోటల్ ను దగ్గుబాటి కుటుంబానికి చెందిన వారు కూల్చివేశారంటూ నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దక్కన్ హోటల్ వివాదంపై హైకోర్టు ఇదివరకే తీర్పిచ్చింది. తాత్కాలికంగా దాని జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ దక్కిన్ కిచెన్ హోటల్ బిల్డింగ్ ను కూల్చివేయించింది. మరోవైపు ఈ కేసు సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చినా బేఖాతరు చేస్తూ దక్కన్ హోటల్ కూల్చివేయారని నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. 

కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసి దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబంపై చర్యలకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దగ్గుబాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని నాంపల్లిలోని 17వ కోర్టు ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశానుసారం ఫిల్మ్ నగర్ పోలీసులు దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ఆయన కుమారులు హీరో రానా, హీరో అభిరామ్ పోలీసులు 448, 452,458,120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఎవరీ నందకుమార్..
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్. ఓ స్వామీజీతో కలిసి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొయినాబాద్ ఫాంహౌస్ లో చర్చకు పిలిచి బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని అభియోగాలున్నాయి. ఆయనకు దగ్గుబాటి ఫ్యామిలీకి దక్కన్ కిచెన్ హోటల్ అంశంపై వివాదం నెలకొంది. తాను ఆ హోటల్ ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నానని నందకుమార్ చెబుతుంటే.. అది తమ సొంతమని దగ్గుబాటి ఫ్యామిలీ ఆ ఆస్తులపై చర్యలు చేపట్టింది. 2022 నవంబర్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది, కొందరు మనుషులతో దగ్గుబాటి ఫ్యామిలీ దక్కన్ కిచెన్ హోటల్ ను పాక్షికంగా కూల్చివేసింది.

నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో ప్రాపర్టీపై తేలే వరకు కూల్చివేతలు లాంటి చర్యలు చేపట్టకుండా యథాతథంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.  కేసు వేశారు. కోర్టు ఆదేశాలను పటట్టించుకోకుండా 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసింది. నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా,  దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పాటు కోర్టు ధిక్కార సెక్షన్ల కింద దగ్గుబాటి కుటుంబసభ్యులు వెంకటేశ్, సురేష్ బాబు, రానా, అభిరామ్ లపై ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments