Homeవినోదంత్రిశూలంతో చిరంజీవుడు... మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ 'విశ్వంభర' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్

త్రిశూలంతో చిరంజీవుడు… మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్ ‘విశ్వంభర’ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్


పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఆగస్టు 22కు ముందు నుంచి సంబరాలు మొదలు అవుతాయి. ఈ ఏడాది కూడా బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును వేడుకగా చేస్తున్నారు. ఈ సంబరాలను, ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ‘విశ్వంభర’ ఫస్ట్ లుక్ విడుదల చేసింది యువి క్రియేషన్స్ సంస్థ.

మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విక్రమ్, వంశీధర్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌ నిర్మాతలు. ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా, అభిమానులకు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి…

Also Read: మీరు ఏమైనా అనుకోండి… నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా… వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ – నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?

హనుమంతునికి చిరంజీవి అపర భక్తుడు. ఆ సంగతి ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘విశ్వంభర’లో ఆ హనుమంతుడు సైతం కీలక పాత్రధారి కానున్నారని సమాచారం. హనుమంతుని ముందు గద పట్టుకున్న చిరంజీవి లుక్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, వేరే లుక్ విడుదల చేశారు. త్రిశూలం పట్టుకున్న చిరంజీవి ఫోటోను ఫస్ట్ లుక్ కింద విడుదల చేసింది ‘విశ్వంభర’ చిత్ర బృందం. ఇది అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లుక్ విడుదలైన కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది.

Also Readఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ – ఏ లాంగ్వేజ్ వెర్షన్ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందంటే?

సంక్రాంతికి థియేటర్లలో ‘విశ్వంభర’ సందడి
సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమాతో చిరంజీవి థియేటర్లలో సందడి చేయనున్నారు. విడుదల తేదీని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.


‘విశ్వంభర’లో సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ కథానాయిక. ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి సరసన ఆవిడ నటిస్తున్న చిత్రమిది. సుమారు 18 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరి పెయిర్ రిపీట్ అవుతోంది. ఇంకా ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతంలో చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీతలు ఇద్దరూ ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments