Trinayani Serial Today Episode నయని వదిన కోమాలో ఉంది కోలు కోలేదు కాబట్టి 5 కోట్లు నామినీగా ఉన్న ఉలూచికి ఇవ్వాలని విక్రాంత్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేశాడని తిలోత్తమ అంటుంది. అందరూ విక్రాంత్ చేసిన పని తప్పు అని మాట్లాడుతారు. విక్రాంత్ చేసిన పనికి తనకేం బాధగా లేదని నయని అంటుంది. దానికి తిలోత్తమ మాకు మాత్రం అనుమానంగా ఉందని విక్రాంత్ ఏ పని చేసినా వెనకాముందు ఆలోచించి చేస్తాడని అంటుంది. అందుకే ఇంట్లో ఉన్నది నయని కాదని త్రినేత్రి అని అంటుంది.
తిలోత్తమ: నయని కోమాలో ఉంది కాబట్టే అలా అప్లై చేశాడని నా డౌట్.
విశాల్: అమ్మా ప్లీజ్ ఇక్కడున్నది త్రినేత్రి అని నయని ఇంకెక్కడో ఉందని మళ్లీ అందర్ని డిస్ట్రబ్ చేయకండి ప్లీజ్.
దురంధర: ఎక్కడైనా ఉంటే ఇదిగో ఇక్కడే ఉందని రుజువు చేయాలికానీ ఇలా మాటలతో బాధ పెట్టకూడదు వదినా.
విక్రాంత్: వదిన సారీ వదిన
నయని: పర్వాలేదు విక్రాంత్ బాబు కానీ ఈ సారి ఇంకేమైనా చేస్తే మీ అమ్మని దృష్టిలో పెట్టుకొని చేయండి.
విక్రాంత్ బయట ఫోన్ మాట్లాడుతుంటే సుమన సంతోషంగా పరుగున వచ్చి విక్రాంత్‌ని వెనక నుంచి వాటేసుకుంటుంది. విక్రాంత్ వదలమని చెప్పినా వదలదు. ఇంతలో హాసిని వచ్చి విడిపిస్తుంది. ఎందుకు అక్క విడిపించావ్ అంటే కనీసం అటు నుంచి రెస్పాన్స్ కూడా లేదు కదా అంటుంది. దానికి సుమన బుల్లిబావగారికి నా మీద చాలా ప్రేమ ఉందని అందుకే ఇన్సూరెన్స్ నా బిడ్డకు దక్కేలా ఇప్పించాలని అనుకున్నారని అంటే నా మీద లవ్‌తోనే ఇలా చేశాడని అంటుంది. విక్రాంత్ చివాట్లు పెడతాడు. పద్ధతి ప్రకారం చేశానని రిప్లే మెయిల్ వస్తుందని అనుకున్నా కానీ ఇలా స్పీడ్ పోస్ట్ వచ్చి ఇరుక్కుపోయానని అంటాడు. నువ్వు అలా చేయడం వెనక ఉద్దేశం ఏంటో ఆలోచించాలని హాసిని అంటుంది. సుమన మాత్రం నా మీద ప్రేమతోనే నా కోసం ఇలా చేశారు నాకు తృప్తి చాలు అని అనుకుంటుంది. తనకు ఇన్సూరెన్స్ డబ్బు రావాలి అంటే మా అక్క త్యాగం చేయాలని అంటుంది. ఇక పావనా మూర్తి నయనితో సుమన అన్ని మాటలు అంటే మీరు నవ్వుతూ ఉండటం బాధగా ఉందని అంటాడు. ఇక విశాల్ అక్కడికి వచ్చి వాళ్లతో మాట్లాడుతాడు.
ఇన్సూరెన్స్‌ని ఉలూచి పేరు మీద కట్టడం చాలా గొప్ప విషయం అని పావనా అంటాడు. సుమన మీద పావనా విరుచుకుపడితే విశాల్ ఎత్తుకొని కోపం వద్దని పావనాని తీసుకెళ్లిపోతాడు. మరోవైపు త్రినేత్రి బామ్మ పట్నం వచ్చి త్రినేత్రి ఫొటో అందరికీ చూపించి అడుగుతుంది. అక్కడే ఉన్న వల్లభని కూడా పిలిచి త్రినేత్రి ఫొటో చూపించి త్రినేత్రి నా మనవరాలు మాది దేవీపురం అని చెప్తుంది. దాంతో వల్లభ ఆశ్చర్యపోయి నీ మనవరాలు మా ఇంట్లో ఉందని రమ్మని చేయి పట్టుకుంటాడు. దాంతో బామ్మ నన్నే బలత్కారం చేయాలి అనుకుంటావా అని తిట్టి కర్ర తీసుకురావడానికి వెళ్తుంది. దాంతో వల్లభ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి అందరూ హాల్‌లో ఉంటే మమ్మీ మమ్మీ అని పిలుస్తాడు. అందరూ ఏమైందని అడుగుతారు. తిలోత్తమ రావడంతో వల్లభ నువ్వు గ్రేట్ మమ్మీ నువ్వు ఇంత తెలివైన దానివి అనుకోలేదని అంటాడు. అందరూ విషయం చెప్పు అని అడుగుతారు. దాంతో వల్లభ నయనిని చూపించి తను పెద్ద మరదలు కాదు కాదు కాదు అని అరుస్తాడు. తను త్రినేత్రినే వాళ్ల ఊరు దేవీపురమే ఇందాకే వాళ్ల బామ్మ రత్నాంభని కలిశాను అని అంటాడు.
నయని: రత్నాంబ ఎవరు
వల్లభ: అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ మీ బామ్మ పేరు రత్నాంబ, మీ మేనత్త మేనమామ పేర్లు వైకుంఠం, ముక్కోటి. నీ ఫొటో పట్టుకొని మీ బామ్మ ఈ పట్నంలో తిరుగుతుంది.
విక్రాంత్: బ్రో కథలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావ్.
వల్లభ: ప్రామిస్ రా నేను ఆ బామ్మని కలిశాను ఆవిడ ఫొటోతో అందరినీ అడుగుతుంది.
పావనా: ఆ బామ్మని ఇక్కడికి తీసుకొస్తే సరిపోయేది కదా.
వల్లభ: కరెక్ట్ కానీ నేను ఆవిడను ఇక్కడికి తీసుకొద్దామని చేయి పట్టుకుంటే నన్ను కొట్టడానికి వచ్చింది. నా మాట నమ్మరా మీరు.
విశాల్: ఆ పెద్దావిడకు కావాల్సింది త్రినేత్రి కదా నయని కాదు కదా.
వల్లభ: అవును
తిలోత్తమ: మళ్లీ అవును అంటావ్ ఏంట్రా త్రినేత్రినే ఇక్కడ ఉంది అని చెప్పాలి కదా. మొన్నటి వరకు నేను నయనినే కాదు అన్నావ్ కదా
నయని: అది మొన్న.
వల్లభ: మీకు దండం పెడతా మొన్నటి వరకు త్రినేత్రి అన్నారు రెండు రోజుల నుంచి నయనిలా ఉందని మీరే అంటున్నారు. అసలు అలా ఎలా మారిపోతుంది.
పావనా: తనకి ఆరోగ్యం బాగు పడ్డాక మళ్లీ ఎందుకు పిచ్చి పిల్లలా మాట్లాడుతుంది అల్లుడు.
విక్రాంత్: వదినకు నయం అయిందని కదా అమ్మ. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి