Homeవినోదం'త్రినయని' సీరియల్: త్రినేత్రిని తీసుకొస్తానని చెప్పిన నయని.. ఇదెలా సాధ్యం.. పాప ప్లాన్ ఏంటి?

‘త్రినయని’ సీరియల్: త్రినేత్రిని తీసుకొస్తానని చెప్పిన నయని.. ఇదెలా సాధ్యం.. పాప ప్లాన్ ఏంటి?


Trinayani Serial Today Episode వల్లభ త్రినేత్రి ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వస్తాడు. బామ్మ నయనిని చూసి త్రినేత్రి అని వెళ్లి అమ్మా త్రినేత్రి ఇక్కడున్నావా ఎన్నాళ్లు అయిందే నిన్ను చూసి ఈ జన్మలో ఇక నిన్ను చూడలేనేమో అని అనుకుంటుంది. చీరలో బాగున్నావ్ దిష్టి తీయించుకున్నావా అని అంటుంది. ఇక ఏం మాట్లాడటం లేదు ఏంటి అని వైకుంఠం అడిగితే పక్కన పెళ్లి కొడుకు విశాల్ బాబు ఉన్నాడు కదా అని ముక్కోటి అంటాడు.

సుమన: పెళ్లి కొడుకా.
బామ్మ: అవునమ్మా. ఆ రోజు నా మనవరాలిని చూసుకోవడానికి ఈ బాబే కదా వచ్చింది. పిల్ల కలిపిన కాఫీ కూడా తాగి చాలా బాగుంది అన్నారు.
వల్లభ: ఏంటి తమ్మీ ఇంకో పెళ్లి చేసుకోవాలనా.
విశాల్: ఆగు అన్నయ్య ఇప్పుడిప్పుడే నాకు కొంచెం అర్థమవుతుంది. మిస్ కమ్యూనికేషన్ వల్ల నన్ను పెళ్లి కొడుకు అనుకున్నారు వీళ్లు. 
వైకుంఠం: అదేంటి బాబు అలా అంటారు మా అమ్మాయి నచ్చింది అని మీరు అన్నారు కదా.
విశాల్: కాఫీ బాగుంది అన్నాను అంతే.
బామ్మ: అంటే ఇష్టం అన్నట్లే కదా.
తిలోత్తమ: త్రినేత్రి నోరు తెరిస్తే అన్నీ విషయాలు తెలుస్తాయి.
హాసిని: వీళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు చెల్లి త్రినేత్రి ఒకేలా ఉండటంతో ఇలా అంటున్నారు.
విక్రాంత్: ఈ బామ్మని నేను హస్పిటల్‌లో చూశాను.
బామ్మ: అవును బాబు నాకు కూడా గుర్తొస్తుంది. మీ వదినకు రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్‌లో ప్రాణాపాయంలో ఉందని నువ్వు ఏడుస్తూ కూర్చొంటే నీకు ధైర్యం చెప్పింది నేనే.
సుమన: అప్పుడు మీ మనవరాలు కూడా ఉందా.
ముక్కోటి: త్రినేత్రినే కదా మా అత్తకి ఆరోగ్యం బాలేకపోతే పట్నం తీసుకొచ్చి చూపించింది. 
వైకుంఠం: ఆ తర్వాత రెండో రోజుకో మాకు కనపకుండా పోయింది.
బామ్మ: అమ్మవారి గుడికి వెళ్లి అడవిలో తప్పిపోయావని వీళ్లు చెప్పినా నేను నమ్మలేదే ఎక్కడో ప్రాణాలతో ఉంటావని నమ్మాను. 
తిలోత్తమ: అదే నిజం మీ మనవరాలు మీ కళ్ల ముందే ఉంది.
సుమన: ఏంటి కొత్త అక్క ఏం ఏం మాట్లాడవే. పోలీసులు వస్తారని భయమా.
నయని: పోలీసులు కాదు మీరు అరచి గోల చేస్తే పడుకొని ఉన్న నా ఇద్దరు పిల్లలు లేచి వస్తారని ఆలోచిస్తున్నా. 

త్రినేత్రి ఫ్యామిలీ షాక్ అయిపోతారు. మీ మనవరాలు నా బిడ్డకు భార్యగా నటిస్తూ విశాల్ పిల్లలకు తల్లి అయిందని అంటుంది తిలోత్తమ. విశాల్‌కి పెళ్లి అయిందని నయనికి కవల పిల్లలు పుట్టారని చెప్పడంతో వాళ్లు షాక్ అయిపోతారు. తను నయని అని హాసిని వాళ్లు అంటే త్రినేత్రి అని బామ్మ వాళ్లు అంటారు. ఇక విశాల్ పెళ్లి కొడుకు వేరే అని తాను కాదని అతను వచ్చి కారు రిపేర్ అవ్వడంతో ఆయన వెళ్లిపోయాడని నేను దాహం వేసి మీ ఇంటికి వచ్చానని అంటాడు. దాంతో పెళ్లి కొడుకు అని పొరపాటు పడ్డామని వైకుంఠం అంటుంది. తను నయని అని మీ త్రినేత్రిని మీరే వెతుక్కోండి అని హాసిని అంటుంది. ఇక నయని హాసినితో నువ్వు వాళ్లకి టిఫెన్ పెట్టు అక్క నేను త్రినేత్రిని తీసుకొస్తానని బయటకు వెళ్తుంది.

ఇక విక్రాంత్ ఏం చేయాలి వదిన ఎందుకు అలా అన్నారు అని ఆలోచిస్తుంటే నయని వస్తుంది. అలా ఎందుకు చెప్పారు అని విక్రాంత్ అడిగితే వాళ్లకి త్రినేత్రి లేదు అని చెప్తే బామ్మ తట్టుకోలేదని అంటుంది. ఏం చేయాలి అని అనుకుంటుండగా గాయత్రీ పాప లాంగావోణి తీసుకొని వస్తుంది. దాంతో నయని పాపని ముద్దాడి పరిష్కారం చూపించావా అని అంటుంది. దాంతో విక్రాంత్ నువ్వు పాపవి కాదు గాయత్రీ పెద్దమ్మవే అని అంటాడు. నయని గురించి ఎలా మరి అని విక్రాంత్ అంటే ఏదో ఒకటి చేద్దాంలే అని నయని అంటుంది. తిలోత్తమ వాళ్లు నయని ఎలా త్రినేత్రిని తీసుకొస్తుందని అనుకుంటారు. సుమన కూడా అదే ఆలోచనలో ఉంటుంది. ఇక వైకుంఠం, ముక్కోటిలు ఈ అవకాశాన్ని వాడుకొని డబ్బు సంపాదించాలని అనుకుంటారు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: బిడ్డని చంపేసింది రాజే అని రూపకి చెప్పిన సూర్య.. బంటీ మీద రాజు సీరియస్!

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments