Homeవినోదంతేజూను తీసుకెళ్లిపోతామంటూ బూతులు తిట్టారు - ఆకతాయిల దాడిపై అమర్‌దీప్ భావోద్వేగం

తేజూను తీసుకెళ్లిపోతామంటూ బూతులు తిట్టారు – ఆకతాయిల దాడిపై అమర్‌దీప్ భావోద్వేగం


Bigg Boss Amardeep: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్స్ పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఈ సీజన్‌లో విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవగా.. రన్నర్ స్థానాన్ని అమర్‌దీప్ దక్కించుకున్నాడు. విన్నర్‌ను ప్రకటించక ముందే చాలామంది ప్రేక్షకులు.. ప్రశాంతే గెలుస్తాడని డిసైడ్ అయిపోయి.. అన్నపూర్ణ స్టూడియోస్ బయట చేరుకున్నారు. ఇక అమర్ హేటర్స్ చాలామంది కూడా అక్కడికి వచ్చారు. అదే సమయంలో షో అయిపోగానే బయటికి రాగానే అమర్‌దీప్ కారుపై దాడులు జరిగాయి. అలా చేయడం కరెక్ట్ కాదని వీడియో విడుదల చేసి చెప్పాడు అమర్. కానీ అసలు ఆరోజు ఏం జరిగింది అనే వివరాలను తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

కారు చుట్టూ తిరిగారు..
బిగ్ బాస్ ఫైనల్స్ అయిపోగానే బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు తనవాళ్లంతా తనను దాక్కోమని చెప్పారని అమర్‌దీప్ గుర్తుచేసుకున్నాడు. వాళ్లు అలా చెప్పినప్పుడు బయట ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని అన్నాడు. అందుకే నేనెందుకు దాక్కోవాలి, నేనేం తప్పు చేశాను అనుకుంటూ బయటికి వెళ్లానని చెప్పాడు. కారులో స్టార్ట్ అయ్యి కాస్త బయటికి రాగానే చాలామంది తన కారు చుట్టూ చేరారని, ఫోన్ లైట్ ఆన్ చేసుకొని కారు చుట్టూ తిరిగారని అన్నాడు. వారందరికీ తాను కనిపించగానే బూతులు తిట్టడం మొదలుపెట్టారని జరిగింది వివరించాడు అమర్‌దీప్. ఆ రత్వాత కారు అద్దాలను రాళ్లతో బద్దలుకొట్టడం మొదలుపెట్టారని తెలిపాడు. తన తల్లి పక్కన ఉండగానే.. వారంతా నోటికి ఏది వస్తే అది మాట్లాడారని వాపోయాడు.

నేను మీకు ఏం పాపం చేశాను?
తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కొడుకు వినలేడని చెప్తూ బాధపడ్డాడు అమర్‌దీప్. వారందరి కోపం తన మీదే కదా అని కారు దిగడానికి ప్రయత్నించానని కానీ తన తల్లి ఆపేసిందని బయటపెట్టాడు. నాలుగు దెబ్బలు తిన్నా పరవాలేదనిపించిదని, కానీ ఆ బూతులు వినలేకపోయానని, భరించకలేకపోయానని వాపోయాడు. తన భార్య తేజూను తీసుకెళ్లిపోతామంటూ అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టారని అన్నాడు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా? నేను మీకు ఏం పాపం చేశాను? అని ప్రశ్నించాడు. వాళ్లందరిపై తాను రియాక్ట్ అవ్వగలనని, కావాలంటే కేసులు కూడా పెట్టేవాడినని అన్నాడు. కానీ వాళ్లందరికీ కూడా కుటుంబాలు ఉంటాయని ఆలోచించి కేసులు జోలికి వెళ్లలేదని తెలిపాడు. బిగ్ బాస్ అనేది గేమ్ మాత్రమే అని గుర్తుచేశాడు. హౌజ్‌లో కొందరు తనను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని సైలెంట్‌గా ఉన్నానని, వారితో నిజాయితీగానే ఉన్నానని, బ్యాక్ బిచింగ్ చేయలేదని చెప్పాడు అమర్.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..
తను కూడా ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వ్యక్తి అని అమర్‌దీప్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఆర్టీసీ ఉద్యోగి అని, అందులో మెకానిక్‌గా పనిచేస్తారని అన్నాడు. తల్లి బీజేపీ మహిళా విభాగంలో మహిళా మోర్చాలో కార్యకర్తగా పనిచేస్తున్నారని బయటపెట్టాడు. రన్నర్ అయినా కూడా అమర్‌దీప్ అతిపెద్ద కోరిక బిగ్ బాస్ వల్లే తీరింది. తన అభిమాన హీరో రవితేజతో నటించే ఛాన్స్ బిగ్ బాస్ వల్లే వచ్చిందని, తనకు అదే పెద్ద విషయమని అన్నాడు అమర్. టాప్ 5 కంటెస్టెంట్స్.. హౌజ్‌లో ఉన్న సమయంలో రవితేజతో సినిమా ఛాన్స్ వస్తే.. టైటిల్‌ను కాదని వదిలేసి వస్తావా అని నాగార్జున అడిగినప్పుడు అమర్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ అభిమానాన్ని చూసి రవితేజ.. తన తరువాతి సినిమాలో తనతో కలిసి నటించే అవకాశాన్ని అమర్‌కు ఇచ్చాడు.

Also Read: రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అడుక్కుంటున్నా – తమిళ దర్శకుడిని ప్రాధేయపడిన షారుఖ్



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments