Homeవినోదంతెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్... ఏ ఓటీటీలో ఉందంటే?

తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్… ఏ ఓటీటీలో ఉందంటే?


ఇటీవల కాలంలో ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఒకేసారి ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం ముందుగా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఓటీటీ లవర్స్ ను అలరించి, ఆ తర్వాత డబ్బింగ్ వర్షన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇలాగే తాజాగా 350 కోట్ల బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింగం అగైన్’ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.

ముందుగా రెంటల్ విధానంలో…

అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకొనే, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్లు కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ ‘సింగం అగైన్’. జియో స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, సినర్జీ, దేవగన్ ఫిలిమ్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ‘సింగం ఎగైన్’ సినిమాకి రవి బస్రూర్, తమన్ సంగీతం అందించారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను గత ఏడాది నవంబర్ 1 న దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో నడిచింది. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ముందుగా ఈ మూవీని రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేశారు.

ముచ్చటగా మూడు భాషల్లో…

డిసెంబర్ 27 నుంచి ‘సింగం అగైన్’ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలైంది. కానీ ఇప్పటిదాకా ఒక్క హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ, ఓటీటీలోకి వచ్చిన నెల రోజుల గ్యాప్ తర్వాత తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంటే రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సింగం అగైన్’ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ మూవీ లవర్స్ కూడా చూడొచ్చు అన్నమాట.

అంచనాలను అందుకోలేకపోయిన ‘సింగం’…

‘సింగం అగైన్’ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ సినిమా అంచనాలకు తగ్గ కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. హిందీ సినీ చరిత్రలోనే భారీ మల్టీసారర్ గా రూపొందిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ రావడంతో కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 389 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ‘సింగం అగైన్’ మూవీ సింగం బ్లాక్ బస్టర్ సిరీస్ లో మూడవ భాగం. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్, సింబా, సూర్య వంశీ లాంటి కాప్ చిత్రాలతో డైరెక్టర్ రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. అదే ఊపుతో ‘సింగం అగైన్’ మూవీని ‘సింగం’కి సీక్వెల్ లో మూడవ భాగంగా తెరపైకి తీసుకొచ్చాడు. 2011లో ‘సింగం’ మూవీ రిలీజ్ కాగా, సీక్వెల్ గా ‘సింగం రిటర్న్స్’ 2014లో వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ‘సింగం అగైన్’ అంటూ దీనికి మరో సీక్వెల్ ని కంటిన్యూ చేశారు.

Also Readఈ వారం టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్… ఫస్ట్ ప్లేస్ ఎవరిది? టాప్ 10లో ఏవేవి ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments