Homeవినోదంతెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 

తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 


Tollywood Industry Persons Will Meet Cm Revanth Reddy: గురువారం ఉదయం 10.30గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినిమా పెద్దలు సమావేశంకానున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, నిర్మాత అల్లు అరవింద్, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజుతోపాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫు నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. దామోదర్ రాజనర్సింహా పాల్గొంటారు.  

చర్చించే అంశాలు ఏంటీ?

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఏడాది తర్వాత జరుగుతున్న భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుతో బెనిఫిట్‌షోలను ప్రభుత్వం రద్దు చేసింది. టికెట్ల రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించమని తేల్చి చెప్పేసింది. మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ను అరెస్టు చేసింది. విచారణకు పిలుస్తోంది. ఇలా వివిధ రకాల సమస్యలు ఇండస్ట్రీని చుట్టుముట్టి ఉన్న వేళ ఇప్పుడు ఈ భేటి ఆసక్తిని కలిగిస్తోంది. 

సినిమా పెద్దలు ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్‌లు పెట్టబోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‌ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని అటు ప్రభుత్వం నుంచి ఇటు సినిమా పరిశ్రమ నుంచి కూడా ఖండనలు వస్తున్నప్పటికీ గ్యాప్ ఉన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 

Also Read: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం ప్రకటించిన పుష్ప 2 టీమ్

సంధ్య థియేట్‌ ఘటనతో రచ్చరచ్చ 

ఈ సమావేశానికి ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కొత్త ఛైర్మన్ దిల్‌రాజు లీడ్ చేస్తున్నారు. డిసెంబర్ నాలుగున పుష్ప-2 రిలీజ్‌ నుంచి అనేక పరిణామాలు జరిగాయి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఇందులో రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. అల్లు అర్జున్ అరెస్టుతో సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాదం ఏర్పడిందనే అనుమానాలు వచ్చాయి. 

లీడ్ చేస్తున్న దిల్‌ రాజు

ఇలాంటి అనుమానాలు ఉన్న టైంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు  ఎంట్రీతో పరిస్థితులు కాస్త కుదట పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిపై పలు మార్లు స్పందించిన దిల్ రాజు…. తాను సంధానకర్తను మాత్రమే అన్నారు. రెండు వర్గాలకు బ్రిడ్జిల్‌లా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇలాంటి మధ్యవర్తి లేకపోవడంతో సీఎంతో సినిమా పరిశ్రమ పెద్దల సమావేశం వీలు కాలేదని తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే సాధ్యమైందని అంటున్నారు. 

Also Read: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments