Homeవినోదంతూచ్... నా కామెంట్స్​ను వెనక్కి తీసుకుంటున్నా... సంధ్య థియేటర్ ఘటనపై రాహుల్ రామకృష్ణ పోస్ట్

తూచ్… నా కామెంట్స్​ను వెనక్కి తీసుకుంటున్నా… సంధ్య థియేటర్ ఘటనపై రాహుల్ రామకృష్ణ పోస్ట్


 Rahul Ramakrishna : ‘పుష్ప 2’ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటు టాలీవుడ్, అటు రాజకీయాల పరంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం రోజురోజుకూ మరింత తీవ్రతరమవుతోంది. అయితే ఈ ఘటనపై కొంతమంది అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తుంటే, మరి కొంతమంది ప్రభుత్వం చేసిన పని కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు ఆయనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తూ గతంలో ట్వీట్ చేశారు. కానీ తాజాగా ఆయన తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. 

కమిషనర్ వీడియో తర్వాత నిర్ణయం…

ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తనను అవమానిస్తున్నారని, తను అలాంటి వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అలాగే అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు రేవతి అనే మహిళ చనిపోయిందనే విషయాన్ని తనకు చెప్పలేదని అల్లు అర్జున్ ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన తన వైపు నుంచి వివరించారు. అయితే కమిషనర్ సివి ఆనంద్ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత రాహుల్ రామకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో “ఆరోజు జరిగిన ఘటన గురించి నాకు సరైన సమాచారం లేదు. కాబట్టి ఈ విషయంలో నేను చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటున్నాను” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతో కొంతమంది రాహు రామకృష్ణపై మండిపడుతుంటే, మరి కొంతమంది మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ పొగుడుతున్నారు. 

రాహుల్ రామకృష్ణ పోస్ట్… 
రాహుల్ రామకృష్ణ డిసెంబర్ 13న అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు. అందులో “సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరమే. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుందే కానీ, ఓ వ్యక్తి చేసిన తప్పు ఎలా అవుతుంది? సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. సినిమా స్థాయిని బట్టి ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతమంది ప్రజలు వస్తారని తెలిసినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అందరిని ఒకేసారి ఎందుకు అనుమతించారు? రాజకీయ పార్టీలు, మతపరమైన ఊరేగింపుల సమయంలో కూడా తొక్కిసలాట జరిగి కొంత మంది మరణిస్తారు. ఆ టైంలో ఇలా ఎందుకు స్పందించరు? సినిమా విషయంలో ఎందుకు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు? బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చేయాలి. అంతేకానీ ఈ ఘటనకి ఒక్కరినే బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు” అంటూ రాస్కొచ్చారు. ఇక ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా కామెంట్ చేశారు.

Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments