‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ గురించి అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ మూవీ టికెట్ ధరల విషయంపై కూడా అదే రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకాయి అంటూ భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అలా విమర్శిస్తున్న వారికి తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టి, కౌంటర్ ఇచ్చారు. తిండి, బట్టలు, ఇల్లు కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువా? అని సూటిగా ప్రశ్నిస్తూనే, ఒక ఇడ్లీ ఎగ్జాంపుల్ ద్వారా ‘పుష్ప 2’కు ఈ రేంజ్ లో టికెట్ ధరలు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని వివరించారు.
‘పుష్ప 2 ఇడ్లీ, ఆ ఇడ్లీలతో పాటు సుబ్బారావు అనే వ్యక్తిని ఎగ్జాంపుల్ గా పెట్టి స్టోరీని మొదలు పెట్టారు వర్మ. “సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను వెయ్యి రూపాయలు పెట్టాడు. అతను అంత ధర పెట్టడానికి కారణం ఏంటంటే… మిగతా ఇడ్లీల కంటే అతని ఇడ్లీలు గొప్పవని నమ్ముతున్నాడు. కానీ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే సుబ్బారావు హోటల్ కి కస్టమర్ వెళ్లడు. అలాంటప్పుడు నష్టపోయేది సుబ్బారావు తప్ప ఇంకెవ్వరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే… సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని వెర్రితనంతో ఏడవడమే అవుతుంది. ఒకవేళ సెవెన్ స్టార్ హోటల్లో యాంబియన్స్ కి మనం ధర చెల్లిస్తున్నాం అని అంటే… పుష్ప విషయంలో ఆ సెవన్ స్టార్ క్వాలిటీ అనేది సినిమానే అవుతుంది. సినిమాలు లాభాల కోసం మాత్రమే నిర్మిస్తారు, ప్రజాసేవ కోసం కాదు. లగ్జరీ కార్ల పై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టల పై ఏడవని వాళ్ళు సినిమా టికెట్ ధరలపై మాత్రం ఎందుకు ఏడుస్తున్నారు?” అంటూ వర్మ సూటిగా ప్రశ్నించారు.
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు…
— Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2024
Also Read:‘పుష్ప 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 – అల్లు అరవింద్ ఏమన్నారంటే?
అంతేకాకుండా “ఇల్లు, తిండి, బట్టలు… ఈ మూడింటికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవసరమా?” అని సూటిగా ప్రశ్నిస్తూనే, “ఈ మూడింటి ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటప్పుడు ఆకాశంలో ఉన్న పుష్ప 2 సినిమాకు ఇప్పుడు పెట్టిన టికెట్ రేట్లు తక్కువే అవుతాయి కదా” అంటూ లాజిక్ ని లాగారు. “అలా అనుకుని చూసేవాళ్ళు చూడొచ్చు. లేదా టికెట్ రేట్లు తగ్గాక కూడా చూడొచ్చు. ఇక మళ్లీ సుబ్బారావు విషయానికి వస్తే… ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయ్యింది. అన్ని సీట్లు బుక్ అయిపోవడమే దానికి ప్రూఫ్” అంటూ సుధీర్ఘ నోట్ ను పంచుకున్నారు. మొత్తానికి వర్మ చెప్పాలనుకున్నది ఏంటంటే ‘పుష్ప 2’ లాంటి బిగ్గెస్ట్ సినిమాకు టికెట్ రేట్లు పెంచడం అనేది కరెక్టే. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక నెటిజన్లు ఎప్పటిలాగే ఆయన పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి